భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలకు కత్తిపోట్లు

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

  • Edited By: veegamteam , November 2, 2019 / 04:10 AM IST
భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలకు కత్తిపోట్లు

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం (నవంబర్ 1, 2019) ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కమ్మరి ఉమకు, సదాశివనగర్‌కు చెందిన రవిచారితో 27 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇంటర్మీడియట్ చదువుతోన్న బాలిక కూడా ఉంది. 

భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నిరోజులుగా ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం (అక్టోబర్ 31, 2019) ఉమ నల్లవెల్లి గ్రామానికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న రవిచారి తన భార్యను ఇంటికి తీసుకెళ్లాలని శుక్రవారం (నవంబర్ 1, 2019) నల్లవెల్లిలోని అత్తగారింటికి వచ్చాడు.

గతంలో తమ కూతురును అనేక ఇబ్బందులకు గురిచేసినందుకు పుట్టింటి నుంచి అల్లుడితో పంపించేందుకు ఉమ తల్లిదండ్రులు రాజవ్వ, బుచ్చన్న నిరాకరించారు. దీంతో రవిచారి తన వెంట తెచ్చుకున్న కత్తితో మామ మెడ, తలపై పొడిచాడు. అత్తను కడుపులో పొడిచాడు.

అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్య చేతులకు గాయాలు చేశాడు. గాయపడిన వారిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పిటల్ కు తరలించారు. ఉమ ఫిర్యాదు మేరకు రవిచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.