పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల 

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 07:38 AM IST
పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల 

శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 160 మంది మృతి చెందారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిమిషం నిమిషానికి మృతులు పెరుగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మూడు చర్చీలు, మూడు హోటళ్లలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ డే వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 

కొలంబోలో జరిగిన పేలుళ్లను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఖండించారు. ప్రజలు సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని పిలుపిచ్చారు. పేలుళ్ల ఘటనపై శ్రీలంక ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించారు. వరుస బాంబు పేలుళ్ల ఘటనపై చర్చిస్తున్నారు. 

రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అయితే దాడులు జరుగొచ్చని శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులు 4 రోజుల ముందే హెచ్చరించింది. 11 చర్చిల్లో పేలుళ్ల జరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.