Rape Attempt : మైనర్ బాలికపై స్వామీజీ అత్యాచారయత్నం

అదిలాబాద్ జిల్లా నేరేడిగోండ మండలం ఇస్పూర్ తాండ గ్రామంలో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై దొంగబాబా అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Rape Attempt : మైనర్ బాలికపై స్వామీజీ అత్యాచారయత్నం

Swamiji Attempted To Rape A Minor Girl

Rape Attempt :  అదిలాబాద్ జిల్లా నేరేడిగోండ మండలం ఇస్పూర్ తాండ గ్రామంలో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై దొంగబాబా అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  నేరేడిగోండ మండలం రాజుర గ్రామ శివారులో ఓ గుట్టపై  7 ఏళ్లుగా జాధవ్ ఆత్మారం (26) అనే వ్యక్తి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు.

వేసవిలో ఆశ్రమం వద్ద నీటి వసతి లేకపోవడంతో ఇస్పూర్ తండా గ్రామస్థులు గ్రామం వద్ద అతనికి వసతిని  ఏర్పాటు చేసారు.  ఈనెల 16న స్వామీజీకి  పండ్లు ఇవ్వడానికి ఓ కుటుంబం తమ కుమార్తెను పంపించింది. ఎంత సేపైనా బాలిక తిరిగి రాకపోవడంతో స్వామిజీ నివాసం వద్దకు తల్లితండ్రులు వెళ్లారు. అక్కడ వారికి తమ కుమార్తె స్పృహ కోల్పోయి కనిపించింది.

బాలికను వారు ఇంటికి తీసుకు  వచ్చి చికిత్స అందించారు. ఆస్పత్రిలో కోలుకున్నాక బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. గ్రామస్థులతో కలిసి తల్లితండ్రులు సోమవారం పోలీసులకు పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఆత్మారం స్వామీజీ పై  పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.