నీకూతురు బదులు నువ్వు వీడియో కాల్ లోకి రా….మహిళను వేధించిన యువకుడు అరెస్ట్

నీకూతురు బదులు నువ్వు వీడియో కాల్ లోకి రా….మహిళను వేధించిన యువకుడు అరెస్ట్

arrested

Tamilnadu Man arrested for sending personal photos of a girl to her mother : కరోనా లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్నాళ్లకు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. పిల్లల చదువుకోసం తల్లితండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. చాలామంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు. మరి కొందరు పిల్లలు దాని ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఒక బాలికను మోసం చేసిన యువకుడు….చివరికి ఆమె తల్లిని బ్లాక్ మెయిల్ చేయబోయాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

తమిళనాడులోని నమక్కల్ జిల్లా రాసిపురం సమీపంలో భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం ఒక స్మార్ట్ ఫోన్ కొని కూతురుకు ఇచ్చింది, ఆ బాలిక ఆన్ లైన్ క్లాసులకు ఫోన్ ద్వారా అటెండవుతూ పాఠాలు నేర్చుకుంటోంది.

ఆన్ లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత, ఫోన్ చేతిలో ఉండటంతో ఆ బాలిక సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రాంలో ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది. అందులో విరుద్ నగర్ కు చెందిన తమిళ్ సెల్వన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రారంభంలో సోదరుడిలా మాట్లాడిన యువకుడు క్రమేపి బాలికను ప్రేమలోకి దింపాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, నిన్ను చూడకుండా, మాట్లాడకుండా, ఉండలేనని మాయమాటలు చెప్పాడు.

బాలిక మనస్సు చెడగొట్టాడు. తద్వారా బాలిక చదువుమీద ధ్యాస పెట్టలేకపోయింది. తమిళ్ సెల్వన్ చెప్పే మాయమాటలకు ప్రేమలో పడిపోయింది. నిన్ను చూడాలని ఉందని చెప్పి వీడియో కాల్ అలవాటు చేశాడు. ఈ క్రమంలో ఒక రోజు నిన్ను నగ్నంగా చూడాలని ఉందని చెప్పి బాలికను ఒప్పించాడు. ఆన్ లైన్ క్లాసులో ఉంటున్న బాలికను డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇంట్లో ఉన్న తల్లి, సోదరుడు ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఎవరూ చూడటం లేదని రూఢీ చేసుకున్నాక బాలిక తమిళ సెల్వన్ కు వీడియో కాల్ లో నగ్నంగా కనిపించింది.

పాపం పిచ్చిపిల్ల…. ఆమెకేం తెలుసు ఆ కీచకుడు అదంతా వీడియో రికార్డు చేశాడు. బాలికతో మాట్లాడుతున్న రోజుల్లో ఆమె తల్లి ఫోన్ నెంబరు కూడా తీసుకున్నాడు. ఒక రోజు ఆమె తల్లి తన కుమారుడ్ని తీసుకుని మార్కెట్ కు వెళ్లిన సమయంలో…తమిళ్ సెల్వన్ ఆమె తల్లికి వీడియో కాల్ చేసి మాట్లాడమని కోరాడు. తమిళ్ సెల్వన్ ఎవరో తెలియకపోవటంతో ఆమె కాల్ రిజెక్ట్ చేసింది. అయినా పట్టువిడవకుండా ఆమెకు పోన్ చేసి విసిగించ సాగాడు, ఆమె ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం ఇవ్వక పోయేసరికి ఆమె కుమార్తె నగ్నచిత్రాల వీడియోల తాలూకా స్క్రీన్ షాట్ తీసి ఆమె వాట్సప్ కు పంపించాడు.

అవి చూసి న తల్లి షాక్ కుగురైంది, నువ్వు నాతో వీడియోకాల్ లోకి రాకపోతే నీ కూతురు నగ్నవీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిపోయిన మహిళ స్ధానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయటానికి రాసిపురం ఉమెన్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అక్కడ పోలీసులు ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫిర్యాదు తీసుకున్నా కేసు నమోదు చేయలేదు.

పరిస్ధితి గమనించిన తల్లీ, కొడుకులు నమక్కల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ఇన్ స్టాగ్రాంలో పరిచయం చేసుకుని తమిళ్ సెల్వన్ చేసిన మోసం గురించి వివరించారు. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించి విరుద్ నగర్ లో ఉన్న తమిళ్ సెల్వన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో తో సహా ఐపీసీలోని 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.