అశ్లీల వీడియోలు చూసిన రాజకీయనాయకులపై విచారణ

  • Published By: chvmurthy ,Published On : December 14, 2019 / 11:40 AM IST
అశ్లీల వీడియోలు చూసిన రాజకీయనాయకులపై విచారణ

ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు.  ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రధమ స్ధానంలో ఉందని అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ఇటీవల సమాచారం వచ్చింది.  కేంద్ర హోం శాఖ దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అవసరమైన చర్యలు తీసుకోమని ఆదేశించింది.

మహిళలు,చిన్నారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను నిరోధించే విభాగం అడిషినల్ డీజీపీ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అశ్లీల వీడియోలు డౌన్ లోడ్ చేసి  చూసేవారి ఐపీ అడ్రస్ లు మా దగ్గర ఉన్నాయని వారిని త్వరలోఅరెస్ట్  చేస్తామని హెచ్చరించారు.దీంతో స్మార్ట్ ఫోన్ లలో అశ్లీలచిత్రాలను చూసే వారిలో కలకలం బయలు దేరింది. ఈ నేపధ్యంలో తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ అనే యువకుడిని పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.  

తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ సెల్ ఫోన్ లో అసభ్య వీడియోలు డౌన్లోడు చేసి స్నేహితులకు షేర్ చేసేవాడు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గతనాలుగేళ్లుగా క్రిష్టోఫర్ ఈ పనులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 150 ఫేస్‌బుక్, వాట్సాప్, ఇంటర్‌నెట్‌ స్నేహితులు టచ్‌లో వున్నట్లు తెలిసింది.

42 ఏళ్ల క్రిష్టోఫర్‌ ఈ వీడియోలను వీక్షించడంతో మానసిక రోగిగా మాపిపోయాడు.. అతడి ఫోన్, మెమెరీ కార్డులను చెన్నైలోని  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక అందగానే విచారణ తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. కిష్ట్రోఫర్‌ 150 మంది స్నేహితుల జాబితాలను తిరుచ్చి – చెన్నై, చెంగల్పట్టు, కోవై జిల్లాల పోలీసులకు తిరుచ్చి పోలీసులు పంపారు. ఈ జిల్లాలోని స్నేహితుల వద్ద విచారణ జరుగుతోంది.

తిరుచ్చిలో రాజకీయ ప్రముఖులు, స్నేహితులు సహా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం క్రిష్టోఫర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రాష్ట్రంలో అశ్లీల వీడియోలను చూసే వారిని పోక్సో చట్టంలో అరెస్టు చేయడం ఇదే ప్రప్రథమం.