ఆగని మరణాలు : మరో ఇంటర్ విద్యార్థి మృతి

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. మరో విద్యార్థిని చనిపోయింది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 05:50 AM IST
ఆగని మరణాలు : మరో ఇంటర్ విద్యార్థి మృతి

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. మరో విద్యార్థిని చనిపోయింది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. మరో విద్యార్థిని చనిపోయింది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (మే 6, 2019) చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఈ విషాదం జరిగింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస(17) ఇంటర్‌ ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో చదువుతోంది.

ఏప్రిల్ 18న వచ్చిన ఇంటర్‌ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో మానస ఫెయిలైంది. మానస మెరిట్ స్టూడెంట్. 10వ తరగతిలో 8 జీపీఏ గ్రేడ్‌ సాధించింది. అలాంటి తాను ఫెయిల్‌ కావడం మానస తట్టుకోలేకపోయింది. అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందు తాగింది. వెంటనే తల్లిదండ్రులు మానసని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 5 రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు. లాభం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లోని సూపర్‌ స్పెషల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. 20 రోజుల నుంచి చికిత్స పొందుతున్న మానస ఆరోగ్య పరిస్థితి విషమించింది. సోమవారం రాత్రి కన్నుమూసింది. ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె తమకు దూరమైందని తల్లిదండ్రులు విలపించారు.