TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ చైర్మన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్.. పోలీసు కస్టడీకి మరో ముగ్గురు నిందితులు

ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ చైర్మన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్.. పోలీసు కస్టడీకి మరో ముగ్గురు నిందితులు

TSPSC Paper Leak

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాపు ముమ్మరం చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు సిట్ అధికారులు జనార్ధన్ రెడ్డిని విచారించారు. విచారణ సమయంలో సిట్ అధికారులు జనార్ధర్ రెడ్డి స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటారు.

ఏప్రిల్ 6వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. సోమవారం 3.30 గంటలకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన సిట్ అధికారులు పేపర్ లీకేజీ వ్యవహారంలో 161 సీఆర్పీసీ కింద చైర్మన్ జనార్ధన్ రెడ్డిని మూడు గంటలపాటు విచారించి, అతని నుంచి వివరాలు సేకరించారు. టీఎస్పీఎస్సీ ప్రధాని కార్యాలయం నుంచి పేపర్ లీక్ అయింది కాబట్టి టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న ఉద్యోగులను సిట్ అధికారులు సాక్షులుగా పొందుపరిచిన నేపథ్యంలో వారందరినీ విచారించారు. గతంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగుల వాంగ్మూలాలను సేకరించి, స్టేట్ రికార్డు చేసుకుని వారిని సాక్షులుగా పరిగణించారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

గతంలో రిమాండో రిపోర్టులో శంకర్ లక్ష్మీని సాక్షిగా పేర్కొంటూ సిట్ అధికారులు రిపోర్టును స్పష్టంగా పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను సైతం సాక్షులను పరిగణించింది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సైతం సాక్షిగా పేర్కొనే అవకాశం ఉంది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. విడతల వారిగా వారందరినీ కస్టడీలోకి విచారించి, స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఏప్రిల్ 11న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై హైకోర్టులో విచారణ ఉంది.

పూర్తి నివేదిక సమర్పించాలని సీట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పూర్తి నివేదికను సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల స్టేట్ మెంట్లతోపాటు ఉద్యోగులు ఇచ్చిన స్టేట్ మెంట్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్ ను ఏప్రిల్ 11న నివేదిక ద్వారా సిట్ అధికారులు హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.