అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : February 1, 2019 / 03:32 AM IST
అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్

అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్ అయ్యాడు. గురువారం(జనవరి 31, 2019) సాయంత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ఏజెన్సీలు అందించిన సమాచారం ప్రకారం పుజారిని సెనెగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల క్రితమే ఈ గ్యాంగ్ స్టర్ దేశం విడిచి పారిపోయాడు. ఇప్పటికే ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆస్ట్రేలియాలో పుజారి ఉంటున్నట్లు ఇప్పటివరకు అందరూ భావించారు. ప్రస్తుతం ముంబై జైళ్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ చోటారాజన్ కి రైట్ హ్యాండ్ గా వ్యవహరించాడు.

ఫుజారి స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని పడబిద్రి. వీరి కుటుంబం పుజారి యుక్తవయస్సులో ఉన్నప్పుడే ముంబైకి షిఫ్ట్ అయింది. అంధేరీలో క్రిమినల్ గా పోలీస్ రికార్డులకెక్కాడు. గ్యాంగ్ స్టర్ బాలా జల్టీని చంపిన తర్వాత తనను తాను అండర్ వరల్డ్ డాన్ గా ప్రకటించుకున్నాడు.  2009 నుంచి 2013 మధ్య కాంలో బాలీవుడ్ సెలబ్రిటీలను డబ్బుల కోసం బెదిరించినట్లు పుజారిపై భారత్ లో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కిడ్నాప్, మర్డర్, బ్లాక్ మెయిల్, చీటింగ్ వంటి వివిధ కేసులో భారత్ లో పుజారిపై నమోదయ్యాయి. 

 సెగనల్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆంటోని ఫెర్నాండేజ్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టుతో పుజారి సెనెగల్ దేశంలో ఉంటున్నాడు.  సెనెగల్ రాజధాని డాకర్ లో ఇంటర్ పోల్ సెంట్రల్ బ్యూరో..లోకల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పుజారిని అరెస్ట్ చేశారు. ప్రత్యేక విమానంలో పుజారినిఅధికారులు భారత్ కి తీసుకురానున్నారు.