మహిళలతో పరిచయాల కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తిన కామాంధుడు

మహిళలతో పరిచయాల కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తిన కామాంధుడు

UP womanizer Posed As Policeman To Trap Women And Rape Them : పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పలువురు మహిళలను లోబరుచుకుని వారిపై లైంగిక దాడి చేస్తున్న కామాంధుడ్ని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు. దాదాపు 4నెలల క్రితం సెప్టెంబర్ 6వ తేదీన పహర్ గంజ్ లోని హోటల్ లో ఒక మహిళపై ఉత్తర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసు స్టేషన్ కి ఫోన్ వచ్చింది. పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్ళగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానీ నిందితుడి ఆనవాళ్లు ఎవరూ చెప్పలేక పోయారు.

హోటల్ రూం బుక్ చేసుకోటానికి పోలీసు అధికారినని చూపించిన గుర్తింపుకార్డు నకిలీదని పోలీసులు తెలుసుకున్నారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లతో నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు రూపోందించారు. అనేక చోట్ల సీసీటీపీ ఫుటేజీలు పరిశీలించినా నిందితుడి ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారు. ఇన్పార్మర్లను పోలీసులు అలర్ట్ చేశారు.

నిందితుడు తరచుగా తన మొబైల్ ఫోన్ నెంబరు, చిరునామా మారుస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టసాగాడు. చివరికి ఒక బార్ లోని కొందరు పనివారు అతడ్ని గుర్తుపట్టారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్, మీరట్ జిల్లా బహుదూర్ ఘర్ గ్రామానికి చెందిన సందీఫ్ కుమార్ (28)గా పోలీసులు గుర్తించారు.

నిందితుడు మహిళలతో పరిచయం పెంచుకోటానికి బార్లు, పబ్ లకు ఎక్కువగా వెళుతున్నట్లు తెలుసుకున్నారు. పబ్ లకు పలువురు మహిళలతో వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసి మంగళవారం నాడు ఒక బార్ లోని సిబ్బంది సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. సందీప్ కుమార్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. వీరిలో ఒకరి ద్వారా కుమారుడు కలిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ ఢిల్లీ డీసీపీ సంజయ్ భాటియా చెప్పారు.