US : ఓ మహిళను చంపి,గుండె తీసి కూర వండిన కిరాతకుడు .. ఐదు జీవిత ఖైదు శిక్షలు విధించిన కోర్టు

రాక్షసుడు, కిరాతకుడు, క్రూరుడు ఇలాంటి మాటలు ఎన్ని అయినా సరిపోవు వరుస హత్యలకు హడలెత్తించిన ఓ నరరూప రాక్షసుడికి. వరుస హత్యలు చేస్తూ ఓ మహిళను చంపి ఆమె గుండెను బయటకు తీసి ఆ గుండెను బంగాళా దుంపలతో కలిపి కూర వండిన కిరాతకుడుకి ధర్మాసనం ఐదు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది.

US : ఓ మహిళను చంపి,గుండె తీసి కూర వండిన కిరాతకుడు .. ఐదు జీవిత ఖైదు శిక్షలు విధించిన కోర్టు

44 Years Old Man Cuts Out Womans Heart Cooks

US : రాక్షసుడు, కిరాతకుడు, క్రూరుడు ఇలాంటి మాటలు ఎన్ని అయినా సరిపోవు వరుస హత్యలకు హడలెత్తించిన ఓ నరరూప రాక్షసుడికి. అమెరికాలోని ఓక్లహామాలో వరుస హత్యలు చేస్తూ ఓ మహిళను చంపి ఆమె గుండెను బయటకు తీసి ఆ గుండెను బంగాళా దుంపలతో కలిపి కూర వండిన కిరాతకుడికి ఓక్లహామా కోర్టు ఐదు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది.

ఆ కిరాతకుడి పేరు లారెన్స్ పాల్ ఆండర్సన్. వయస్సు 44 ఏళ్లు. అమెరికాలో జీవిస్తున్న ఈ లారెన్స్ నల్ల జాతీయుడు. 2021లో వరుస హత్యలతో నరరూప రాక్షసుడిగా పేరొందాడు. అంత్యంత క్రూరంగా హత్యలు చేసే లారెన్స్ నాలుగేళ్ల చిన్నారిని కూడా వదల్లేదు. అండ్రియా బ్లాంకెన్ షిప్ అనే మహిళను చంపిన లారెన్స్ ఆమె గుండెను బయటికి తీసి దాన్ని బంగాళా దుంపలతో కలిపి కూర వండి ఆమె బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. దాన్ని వారితో తినిపించటానికి యత్నించాడు. కానీ ఆ కూర ఏమిటో కూడా తెలియనవి వారు దాన్ని తినటానికి ఇష్టపడలేదు. దీంతో లారెన్స్ తన కిరాకత్వాన్ని మరోసారి బయటపెడుతూ ఆండ్రియా బంధువులైన 67 ఏళ్ల లియోన్, నాలుగేళ్ల కియోస్ యేట్స్ ను కత్తితో పొడిచి పొడిచి అంత్యంత దారుణంగా చంపేశాడు. ఇలా అతను చేసే దారుణాలు అన్ని ఇన్నీకావు.

నిజానికి ఓ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆండర్సన్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఓక్లహామా గవర్నర్ కెవిన్ స్టిట్ కమ్యుటేషన్ ఇచ్చిన క్రమంలో ఈ డ్రగ్స్ కేసులో 20 ఏళ్ల శిక్షను కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అనుభవించి విడుదల అయ్యారు. క్రమశిక్షణతో ఉన్న, పరివర్తన చెందిన ఖైదీలను ముందుగా విడుదల చేయగా.. అందులో అండర్సన్ కూడా ఉన్నాడు. ఇక్కడే ఘోరాతి ఘోరమైన పొరపాటు జరిగింది. క్రమశిక్షణతో ఉన్న, పరివర్తన చెందిన ఖైదీల విడుదల లిస్టు (సామూహిక కమ్యుటేషన్ )లో అండర్సన్ పేరు పొరపాటున చేర్చటంతో అతను 20 ఏళ్లు జైల్లో ఉండాల్సినవాడు మూడేళ్లకే విడుదల అయ్యాడని దర్యాప్తులో తేలింది. ఆ పొరపాటుకు మూల్యం ఓ నాలుగేళ్ల చిన్నారితో పాటు మూడు ప్రాణాలు బలి అయిపోయాయి.

అలా జైలు నుంచి విడుదల అయిన నెల రోజుల్లోనే ఈ మూడు హత్యలు చేశాడీ కిరాతకుడు.ఎంతోమందిపై దాడికి పాల్పడ్డాడు. అతని దాడిలో గాయపడి ప్రాణాలతో బయపటడినవారు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. న్యాయ పోరాటానికి దిగారు. శిక్ష పూర్తి కాకముందే అండర్సన్ ను రిలీజ్ చేసి, దారుణ హత్యలకు కారణమయ్యారని ఓక్లహామా గవర్నర్, జైలు పెరోల్ బోర్డుపై కేసులు వేశారు. అలా బాధితుల న్యాయపోరాటంతో మరోసారి అండర్సన్ ను అరెస్ట్ విచారించగా నేరాలను అంగీకరించాడు. దీంతో అతనికి కోర్టులో ప్రవేశపెట్టగా ఐదు జీవిత ఖైదు శిక్షలు విధిస్తు ఓక్లహామా కోర్టు తీర్పునిచ్చింది.