ఇంట్లో రాక్షసులను పారద్రోలేందుకు మనిషిని చంపి గుండెతో కూర వండిన వ్యక్తి

ఇంట్లో రాక్షసులను పారద్రోలేందుకు మనిషిని చంపి గుండెతో కూర వండిన వ్యక్తి

US Criminal, Triple Murder suspect cooked Victims”s heart, tried served to other victims : కొన్నిరకాల నేర వార్తలు వింటుంటే వీళ్లు మనుషులా రాక్షసులా అనిపిస్తూ ఉంటుంది. ఇంత క్రూరంగా మనుషుల్ని చంపేయగలుగుతన్నారా అని భయం కలుగుతుంటుంది.ఇటీవల గంజుపడుగు వద్ద న్యాయవాద దంపతులను నడిరోడ్డు మీద కత్తులతోనరికినఘటనకానీ, చిత్తూరు జిల్లా మూఢనమ్మకాల పేరుతో కూతుళ్లను అంతమొందించన ఘటన కానీ వింటుంటే ఒకింత భయం కలుగుతుంటుంది.

ఇటీవల అమెరికాలో ఇలాంటి భయానక ఘటన ఒకటి చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో రాక్షసులు ఉన్నారని వాటిని వెళ్ళగొట్టేందుకు, ఆ ఇంట్లో వారు మనిషి మాంసం తినాలని పట్టుబట్టాడు. దీంతో భయపడిన ఆ కుటుంబసభ్యులను ఇద్దరిని హత్య చేశాడు. తప్పించుకున్న మరోకరు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

అనమెరికాలోని ఓక్లహామా స్టేట్ లో నివసించే లారెన్స్ పౌల్ ఆండర్సన్ అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో ఆరెస్టై 20 ఏళ్ళు జైలు జీవితం గడిపి ఇటీవలే విడుడలై వచ్చాడు. రెండు వారాల క్రితం ఆండర్సన్ ఓ దారుణానికి ఒడి గట్టాడు. తన ఇంటి పక్కన నివసించే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు.

అనంతరం ఆ వ్యక్తి గుండెను బయటకు తీసి వాళ్ల అంకుల్ వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ గుండెను కోసి బంగాళదుంపలతో కలిపికూర వండాడు. ఆ తర్వాత కూరను అంకుల్ వాళ్ల ఇంట్లో వాళ్లు అందరినీ తినమని బలవంతం చేశాడు. ఆండర్సన్ వికృతచేష్టలకు భయపడిన కుటుంబ సభ్యులు ఇంట్లోంచి పారిపోబోయారు. దాంతో ఆండర్సన్ వాళ్ల అంకుల్ ను, వారి నాలుగేళ్ల కుమార్తెను చంపేశాడు.

అంకుల్ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రంలో ఆమె అతడినుంచి తప్పించుకుని పారిపోయింది. ఆమె ఒంటిపై గాయాలను చూసిన స్ధానికులు ఆస్పత్రికి తరలించారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న ఓక్లహామా పోలీసులు ఆండర్సన్ ను అరెస్ట్ చేశారు. విచారణలో ఆండర్సన్ పోలీసలు విస్తుపోయే విషయాలు చెప్పాడు.

తన అంకుల్ వాళ్లింట్లో రాక్షసులు ఉన్నారని ..వారిని తరిమేందుకు గుండెనువండి వారితో తినిపించాలనుకున్నానని చెప్పాడు. వాళ్లు ఒప్పుకోక పోవటంతో చంపేయాల్సి వచ్చిందని…. లేకపోతేరాక్షసుల అంకుల్ కుంటుబాన్ని పీడించివారిని చంపేసేవారని తాపీగా వివరించేసరిక పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని కోర్టులో హజరు పరచగా చేసిన హత్యలు ఒప్పకున్నట్లు స్ధానిక మీడియా తెలిపింది.