AP Crime News : ప్రేమ పేరుతో యువతికి వల…ఏపీ నుంచి యూపీకి తీసుకెళ్లి హత్య చేసిన నిందితులు

విజయవాడ చిట్టినగర్‌కు చెందిన తస్నీమ్ ఫాతిమా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్ని‌కుండ్ డ్యామ్‌లో పడేసిన యువతి మృతదేహాం ఈ రోజు లభ్యమయ్యింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విజయవాడ తీసుకువచ్చేందుకు పోలీసులు ఉత్తరప్రదేశ్ బయలు దేరి వెళ్లారు. 

AP Crime News : ప్రేమ పేరుతో యువతికి వల…ఏపీ నుంచి యూపీకి తీసుకెళ్లి హత్య చేసిన నిందితులు

Fathima Murder Case

AP Crime News  : విజయవాడ చిట్టినగర్‌కు చెందిన తస్నీమ్ ఫాతిమా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్ని‌కుండ్ డ్యామ్‌లో పడేసిన యువతి మృతదేహాం ఈ రోజు లభ్యమయ్యింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విజయవాడ తీసుకువచ్చేందుకు పోలీసులు ఉత్తరప్రదేశ్ బయలు దేరి వెళ్లారు.

విజయవాడ చిట్టినగర్ కు చెందిన ఫాతిమా(21)కు మానసిక స్ధితి సరిగా లేకపోవటంతో ఆమె తండ్రి మాలానా నజీర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాసిఫ్ అనే భూతవైద్యుడ్ని సంప్రదించాడు.  ఆమెకు వైద్యం చేసేందుకు వాసిఫ్ విజయవాడ వచ్చాడు. ఫాతిమాకు భూతవైద్యం చేసాడు. భూత వైద్యం జరుగుతున్నసమయంలో వాసిఫ్ తన స్నేహితుడు తయ్యబ్ సాయంతో ఫాతిమాను ట్రాప్ చేశాడు.

ఆ యువతి వాసిఫ్ మాయమాటలను నమ్మింది.  ఈక్రమంలో జులై 10వ తేదీన వాసిఫ్,తయ్యబ్‌లు ప్రేమ పేరుతో యువతిని ఉత్తర‌ప్రదేశ్ తీసుకువెళ్లారు. ఆమె వంటిమీద ఉన్న15 తులాల బంగారాన్ని తీసుకుని యువతిని హత్య చేసి హత్ని‌కుండ్ డ్యామ్‌లో పడేశారు. ఆ ప్రాంతం విజయవాడకు సుమారు 2060 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.

కాగా…..జులై 10వ తేదీ నుంచి తన కుమార్తె   కనపడకపోయేసరికి తండ్రి నజీర్ కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటినుంచి బయలు దేరిన ఫాతిమా రైల్వే స్టేషన్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. కేసువిచారణలో వాసిఫ్, తయ్యబ్, ఫాతిమాలు ఢిల్లీ వెళ్లిన రైల్వే టికెట్లను పోలీసుల సంపాదించారు.

దీంతో భూత వైద్యులే తన కుమార్తెను కిడ్నాప్ చేశారని భావించిన వజీర్ యూపీ కి  వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. వజీర్ ఇచ్చిన ఆధారాలతో నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా…తామే ఫాతిమాను హత్యచేసినట్లు, ఆమెకు చెందిన 15తులాల బంగారం తమ వద్దే ఉన్నట్లు నిందితులిద్దరూ ఒప్పుకున్నారు.

కాగా… ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయాలని ఉత్తర‌ప్రదేశ్ పోలీసులు షరతు విధించారు. దీంతో బాధితురాలి తండ్రి ఆలోచనలో పడ్డారు. విజయవాడ పోలీసులేమో నేరం ఇక్కడ జరగలేదు   కాబట్టి మా పరిధిలోకి రాదు  అన్నారు. ఈ‌హత్యోదంతంపై 10 టీవీ వరుస కధనాలు ప్రసారం చేయటంతో విజయవాడ పోలీసు కమీషనర్ బత్తిన శ్రీనివాసులు నిందితులను ఉత్తర‌ప్రదేశ్ నుంచి విజయవాడ తీసుకు రావటానికి అంగీకరించి…ఏపీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 2 టీంలను ఉత్తరప్రదేశ్‌కు పంపించారు.

కాగా బాధితురాలి తండ్రి మాలానా నజీర్ 13 రోజులుగా సహరం‌పూర్‌లోనే ఉండి ఫాతిమా మృతదేహాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్ధానిక అధికారులను సంప్రదించగా గత మూడు రోజులనుంచి హత్నికుండ్ డ్యామ్ లో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. కాగా బుధవారం ఫాతిమా మృతదేహం లభ్యమయ్యింది. ఫాతిమా మృతదేహం నీళ్ళలో నాని పోయి ఉండటంతో విజయవాడ తీసుకురావాలా వద్దా అనే విషయం ఇంకా తేలలేదు.