Viral Video: అమ్మాయిలను సినిమాల్లో హీరోలు కాపాడతారు.. నిజ జీవితంలో ఇతడు.. నడిరోడ్డుపై ఫైట్ చేసి..

నిజ జీవితంలో ఓ యువకుడు.. విలన్‌తో ఫైట్ చేసి ఓ అమ్మాయిని కాపాడి హీరో అయిపోయాడు. స్కూటర్ పై ప్రీతి అనే ఓ అమ్మాయి..

Viral Video: అమ్మాయిలను సినిమాల్లో హీరోలు కాపాడతారు.. నిజ జీవితంలో ఇతడు.. నడిరోడ్డుపై ఫైట్ చేసి..

Viral Video

Updated On : June 28, 2023 / 5:29 PM IST

Viral Video – Pune: అమ్మాయిలను సినిమాల్లో హీరోలు కాపాడడం చూస్తూనే ఉంటాం. నిజ జీవితంలో మాత్రం అటువంటి ఘటనలు కనపడవు. నడిరోడ్డుపై అమ్మాయిలపై భీకరంగా దాడులు జరుగుతున్నా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారే తప్ప కాపాడే ప్రయత్నాలు చేయరు. ఇటువంటి ఘటనలు ఎన్నో సార్లు జరిగాయి.

అయితే, నిజ జీవితంలో ఓ యువకుడు మాత్రం విలన్‌తో ఫైటింగ్ చేసి ఓ అమ్మాయిని కాపాడి హీరో అయిపోయాడు. స్కూటర్ పై ప్రీతి అనే ఓ అమ్మాయి వెళుతోంది. ఆమెను చంపేందుకు కొడవలి పట్టుకుని దూసుకొచ్చాడు ఓ యువకుడు. ఆ అమ్మాయి స్కూటర్ ను ఆపాడు. అతడి చేతిలో కొడవలి ఉండడాన్ని గమనించిన ఆమె అరుస్తూ పరుగులు తీసింది.

ఆమెను పట్టుకుని కొడవలితో దాడి చేయబోయాడు యువకుడు. అదే సమయంలో లేష్పాల్ ఖిబాగే అనే మరో యువకుడు హీరోలా వచ్చి ఆ అమ్మాయిని కాపాడాడు. నిందితుడి నుంచి కొడవలిని లాక్కున్నాడు. అంతేగాక, నిందితుడు పారిపోకుండా పట్టుకున్నాడు.

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజ జీవితంలో లేష్పాల్ ఖిబాగే హీరో అని నెటిజన్లు కొనియాడుతున్నారు. అమ్మాయిని నడిరోడ్డుపై చంపబోయిన నిందితుడి పేరు శాంతను జాధవ్ అని పోలీసులు చెప్పారు. అతడిని అరెస్టు చేశామన్నారు.

Quran Burning: మసీదు ముందే ఖురాన్‭ను కాల్చేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు