భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో బెడ్ రూమ్ లో భర్త..

భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య

  • Published By: veegamteam ,Published On : April 12, 2020 / 07:48 AM IST
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో బెడ్ రూమ్ లో భర్త..

భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య

భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అడ్డంగా దొరికిపోయినా అతడిలో మార్పు రాలేదు. పైగా తన అక్రమ సంబంధం గురించి నిలదీసిన భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లు అతడి ఆగడాలు భరించిన ఆమె, చివరికి ఓపిక నశించి పోలీసులను ఆశ్రయించింది.

ఛత్తీస్ ఘడ్ లోని రాయ్‌పూర్‌లోని దోన్‌గర్‌గఢ్ ప్రాంతంలో కిషన్ అనే వివాహితుడు నివాసం ఉంటున్నాడు. అతని భార్య పేరు కుసుమ్. వీరి ఇంట్లో పూనం అనే మహిళ పని మనిషిగా పని చేస్తుంది. రామ్ కన్ను పూనంపై పడింది. భార్యకి తెలియకుండా పనిమనిషితో రిలేషన్ నడిపాడు. భార్య కుసుమ్ ఇంట్లో లేని సమయంలో వీరు క్లోజ్ గా మాట్లాడుకునేవారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ రాసలీలలు సాగించడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఇక రోజూ బెడ్రూమ్ లోనే చేరి శృంగారంలో మునిగితేలడం పరిపాటిగా మారింది. 

ఓ రోజు భార్య కుసుమ్ కు తన భర్త, పనిమనిషి మధ్య ఉన్న సంబంధం తెలిసింది. అయినప్పటికీ ఏమీ అనలేకపోయింది. ఓ రోజు రామ్ పట్టపగలే పనిమనిషితో రాసలీలల్లో మునిగి తేలుతుండగా అది గమనించిన భార్య కుసుమ్ తట్టుకోలేకపోయింది. భర్తను నిలదీసింది. దీంతో రామ్ మరింత రెచ్చిపోయాడు. నన్నే నిలదీస్తావా అంటూ భార్యనే తప్పుపట్టాడు. అంతేకాదు ఆమెను చిత్ర హింసలకు గురిచేయడం స్టార్ట్ చేశాడు. దీంతో కుసుమ్ మౌనంగా ఉండిపోయింది. కొన్నాళ్లు భర్త ఆగడాలు భరించిన ఆమె.. చివరకు ఒక రోజు ధైర్యం చేసింది.

తన భర్త, పనిమనిషితో నడుపుతున్న వివాహేతర బంధానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను రహస్యంగా తీసి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు..తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీసింది. కుసుమ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.