woman blackmailing Hyderabad man : సోషల్ మీడియా పరిచయం..వాట్సప్ లో నగ్నంగా వీడియోకాల్స్..రికార్డు చేసి బ్లాక్ మెయిల్

ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకుంది. తర్వాత క్రమంలో వాట్సప్ వీడియో కాల్స్ తో మాట్లాడటం మొదలెట్టింది. అనంతరం నగ్నంగా వాట్సప్ వీడియో కాల్స్ చేస్తూ రెచ్చగొట్టింది.

woman blackmailing Hyderabad man : సోషల్ మీడియా పరిచయం..వాట్సప్ లో నగ్నంగా వీడియోకాల్స్..రికార్డు చేసి బ్లాక్ మెయిల్

Black Mail On Whats App Video Nude Call

Rajasthan woman blackmailing Hyderabad man after recording his Nude video call on whats app : ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకుంది. తర్వాత క్రమంలో వాట్సప్ వీడియో కాల్స్ తో మాట్లాడటం మొదలెట్టింది. అనంతరం నగ్నంగా వాట్సప్ వీడియో కాల్స్ చేస్తూ రెచ్చగొట్టింది. అతడ్ని కూడా నగ్నంగా ఉండమని చెప్పి ఆ కాల్స్ స్క్రీన్ రికార్డు చేసింది. అనంతరం వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి రూ. 2లక్షల వరకు వసూలు చేసింది.ఇంకా డబ్బులు డిమాండ్ చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్ మలక్ పేటకు చెందిన వ్యక్తికి రాజస్ధాన్ కు చెందిన ఓ యువతి ఫేస్ బుక్ లో ప్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అది యాక్సెప్ట్ చేశాడు. అనంతరం ఫేస్ బుక్ మెసెంజర్ లో కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయువకుడి వాట్సప్ నెంబర్ అడిగి తీసుకుందా యువతి.

అనంతరం వాట్సప్ చాటింగ్ మొదలెట్టారు.ఆ తర్వాత వాట్సప్ వీడియో కాల్స్ చేసుకున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి మనం ఫ్రెండ్స్ కదా అంటూ నగ్నంగా వాట్సప్ వీడియో కాల్ చేసి కవ్వించింది. అతడ్ని కూడా నగ్నంగా ఉండి వీడియో కాల్ లో మాట్లాడమని చెప్పింది. ఆమె చెప్పినట్లే చేశాడు ఆయువకుడు.

అతనికి తెలియకుండా స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోను భద్రపరిచింది. అనంతరం ఆవీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి దాని లింక్ అతనికి పంపించింది. దీంతో బాధితుడు ఆమెకు ఫోన్ చేయగా ఆ వీడియో డిలీట్ చేయాలంటే రూ.50వేలు ఇస్తే తొలగిస్తానని చెప్పింది. దీంతో బాధితుడు ఆమె ఖాతాకు 50 వేల రూపాయలు పంపించాడు.

ఆ తర్వాత ఢిల్లీక్రైమ్ బ్రాంచ్ నుంచి మట్లాడుతున్నట్లు ఒక గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి…. మీపై ఒక యువతి ఫిర్యాదు చేసిందని, నగ్నంగా ఉన్న ఆమె వీడియోను అడ్డం పెట్టుకుని వేధిస్తున్నారని… మీ పైన ఎఫ్ఐఆర్ నమోదుచేస్తామని హెచ్చరించింది.

దీంతో భయపడిన బాధితుడు వారు అడిగినట్లు 1లక్షా 50 వేల రూపాయలు వారిచ్చిన బ్యాంకు ఖాతాలకు బదగిలీ చేసి కేసునమోదు కాకుండా చూడాలని కోరాడు. ఆతర్వాత కూడా ఆ యువతి డబ్బులుకోసం పదే పదే ఫోన్ చేస్తుండటంతో బాధితుడు హైదరబాదా లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.