అత్తపై అల్లుడి అత్యాచారం : హైదరాబాద్ లో మరో దారుణం

దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 03:10 AM IST
అత్తపై అల్లుడి అత్యాచారం : హైదరాబాద్ లో మరో దారుణం

దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు

దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు కూడా తెస్తున్నాయి. దిశ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చింది. అత్యాచారం చేస్తే మరణశిక్షే అని చెప్పింది. అయినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వీధుల్లోనే కాదు ఇంట్లో కూడా మహిళలకు రక్షణ కరువైంది.

తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున మరో దారుణం జరిగింది. అత్తపై అల్లుడు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పంజాగుట్టలో ఈ ఘోరం జరిగింది. మత్తు నుంచి తేరుకున్న బాధితురాలు జరిగిన దారుణాన్ని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అల్లుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తల్లి తర్వాత తల్లి లాంటి అత్తపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వావి వరసలు మరిచి కామాంధులు సాగిస్తున్న కీచక పర్వం ఆందోళనకు గురి చేస్తోంది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఈ ఘటనలు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన దిశ హత్యాచార ఉదంతంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగానే.. అత్యాచార ఘటనలు అనేకం చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఎన్‌కౌంటర్లు జరిగినా, చట్టాలను కఠినతరం చేసినా.. ఈ దారుణాలు ఆగకపోవడం మహిళల్లో భయం నింపింది. అమ్మాయిలను బయటకి పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం ఏరులై పారుతుండటం, సినిమాల్లో పెరిగిన అశ్లీలత, పోర్న్ సైట్లు, స్మార్ట్ ఫోన్లు.. సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.