అర్థరాత్రి వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఊహించని పని చేసిన ప్రియుడు, షాక్‌లో ప్రియురాలు

సిద్దిపేటలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు..ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే కోసుకున్నాడు.

అర్థరాత్రి వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఊహించని పని చేసిన ప్రియుడు, షాక్‌లో ప్రియురాలు

Young Man Cuts Neck

Young Man Cuts Neck : సిద్దిపేటలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే మణికట్టు, గొంతు కోసుకున్నాడు.

సిద్దిపేట హౌసింగ్‌ బోర్డు పరిధిలోని అరుంధతి కాలనీకి చెందిన మనోజ్‌కుమార్‌ (25) ల్యాబ్‌ టెక్నీషియన్‌. పట్టణానికి సమీపంలో ఉండే ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. పంచాయితీ నిర్వహించి దూరంగా ఉండేలా రాజీ కుదుర్చుకున్నారు. బుధవారం(మార్చి 31,2021) రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన మనోజ్‌ పైఅంతస్తులో ఉండే గదికి వెళ్లాడు. అక్కడ ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించే అతడు అర్ధరాత్రి తర్వాత యువతికి వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు.

ఆ క్రమంలో ఉద్వేగానికి లోనైన మనోజ్ సర్జికల్‌ బ్లేడ్‌తో ఎడమ చేతి మణికట్టు, గొంతు కోసుకొన్నాడు. దీంతో యువతి బిత్తరపోయింది. మనోజ్ చేసిన పనికి షాక్ అయ్యింది. ఆ వెంటనే మనోజ్ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలిపింది. వారు వెంటనే మనోజ్ గదికి వెళ్లారు. స్పృహ తప్పి ఉన్న మనోజ్ ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కానీ లాభం లేకపోయింది. మనోజ్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో మనోజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకు అండగా ఉంటాడని భావిస్తే, ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాడని బోరమన్నారు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.