వీధి కుక్కపై లైంగిక దాడి చేసిన యువకుడు

వీధి కుక్కపై లైంగిక దాడి చేసిన యువకుడు

Young man raped street dog in Mysuru, caught camera : మైసూర్ లో దారుణ ఘటన జరిగింది. ఎక్కడైనా పురుషులు స్త్రీలపై లైంగిక దాడులు అత్యాచారాలు చేసిన ఘటనలు చూశాం,కానీ మైసూర్ లోని ఓయవకుడు వీధి కుక్కపై లైంగిక దాడి చేశాడు. దాన్ని మరికొంత మంది యువకుడు ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

మైసూర్ లోని గోకులం 3వ స్టేజ్ లో నివసించే సోమశేఖర్(26) అనే యువకుడు ఈనెల 11వ తేదీ రాత్రి వారి సందులో ఉన్న వీధికుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సోమ శేఖర్ చేస్తున్న ఈ పనిని మరి కొందరు కుర్రాళ్లు చాటుగా వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధి చూసిన పీపుల్‌ ఫర్‌ అనిమల్స్‌ (పీఎఫ్‌ఎ) అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసారు.

జంతువులపై  లైంగికదాడి జరిపాడనే ఆరోపణలతో సోమశేఖర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. జంతువులపై  లైంగిక వేధింపులకు పాల్పడటం కొత్తేమి కాదని..గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయని పీపుల్ ఫర్ యానిమల్స్ కు చెందిన కేబి హరీష్ చెప్పారు.నిందితుడు చేసినది అసహజమైన లైంగిక చర్య అని,తప్పు నిరూపించబడితే నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని జంతు సంక్షేమశాఖఅధికారి ఒకరు చెప్పారు.

మైసూర్ మెడికల్ కాలేజీలోని సైక్రియాటిక్ విభాగం ఫ్రోఫెసర్. డాక్టర్. బీఎన్ రమేష్ మట్లాడుతూ…కొంతమంది అసహజమైన లైంగిక సంబంధం కలిగి ఉండటానికి వక్రీకృత లైంగిక ప్రవర్తన ప్రధాన కారణం అని చెప్పారు. ఒక వ్యక్తి అటువంటి రోగానికి గురైనప్పుడు వారి లైంగిక కోరికను ఏదోవిధంగా తీర్చుకోవాలనుకుంటాడని ఆయన వివరించారు.