IIT Madras : ఎంట్రన్స్ పరీక్షలేకుండానే ఐఐటి మద్రాస్ డేటా సైన్స్ కోర్సు ప్రవేశాలు

సీట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది.

IIT Madras : ఎంట్రన్స్ పరీక్షలేకుండానే ఐఐటి మద్రాస్ డేటా సైన్స్ కోర్సు ప్రవేశాలు

Iit Madras

IIT Madras :మద్రాస్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బిఎస్సీ ప్రొగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఐఐటిలో ప్రశానికి జెఈఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండానే ఐఐటి మద్రాస్ బిఎస్సీ ప్రొగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ మొదటి , ద్వితియ సంవత్సరాలు చదువుతున్న వారు, కళాశాల స్ధాయి విద్యార్ధులు, వర్కింగ్ ప్రొఫెసర్లు, ఉద్యోగవిరమణ చేసిన వారు సైతం ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

సీట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో వీడియో లెక్చర్ లు , వీక్లీ అసైన్ మెంట్ లు, చర్చా వేదిక , ప్రొఫెసర్లుతో ప్రత్యక్ష చర్చలు ఉంటాయి. ఈ నాలుగు వారాల్లో నేర్చుకున్న విషయాలపై అర్హత పరీక్ష నిర్వహిస్తారు. కనీస కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఈ బీఎస్సీ ప్రొగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.

ప్రొగ్రామ్ లో అర్హత సాధించిన వారికి స్కాలర్ షిప్ లు అందిస్తారు. జెఈఈ అడ్వాన్స్ డ్ రాయటానికి అర్హత సాధించిన విద్యార్ధులు ఈ ప్రోగ్రామ్ లో చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను ఏప్రిల్ 20, 2022 పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; onlinedegree.iitm.ac.in సంప్రదించగలరు.