AIIMS Gorakhpur Recruitment : ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లోనాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే పోస్టులను బట్టి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

AIIMS Gorakhpur Recruitment : ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లోనాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

aiims gorakhpur

AIIMS Gorakhpur Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) గోరఖ్‌పుర్‌లో వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 142 గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : CM Jagan : ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డ్స్ అవార్డుల ప్రదానం : సీఎం జగన్

పోస్టుల వివరాలు :

ట్యూటర్/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 15 పోస్టులు
స్టాఫ్ నర్స్ గ్రేడ్-I: 57 పోస్టులు
మెడికల్‌ సోషల్‌ వర్క్‌: 01 పోస్టులు
అసిస్టెంట్‌ ఎన్‌ఎస్‌: 01 పోస్టులు
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-II: 08 పోస్టులు
లైబ్రరీ అటెండెంట్‌ గ్రేడ్-II: 01 పోస్టు
ఎల్‌డీసీ (లోయర్‌ డివిజన్ క్లర్క్): 01 పోస్టు
హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III (నర్సింగ్ ఆర్డర్లీ): 40 పోస్టులు

READ ALSO : Rice Borer : వరిలో సుడిదోమ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

లైబ్రేరియన్ గ్రేడ్-II: 01 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నిషియన్‌: 01 పోస్టు
స్టోర్ కీపర్: 02 పోస్టులు
హాస్టల్ వార్డెన్: 02 పోస్టులు
పీఏ టు ప్రిన్సిపాల్: 01 పోస్టు
ల్యాబ్ టెక్నీషియన్: 08 పోస్టులు
స్టెనోగ్రాఫర్: 01 పోస్టు
క్యాషియర్: 02 పోస్టులు

READ ALSO : Nutritional Deficiencies in Women : మహిళల్లో కనిపించే 5 సాధారణ పోషక లోపాలు…లక్షణాలు, పరిష్కారాలు

అర్హతలు ; దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే పోస్టులను బట్టి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

READ ALSO : Saffron Health Benefits : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతోపాటు మానసిక స్థితిని పెంచే కుంకుమ పువ్వు !

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1770 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1416 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది 21.11.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsgorakhpur.edu.in/ పరిశీలించగలరు.