Hyderabad : మహిళలూ.. జాబ్ అవసరమా? లిటరసీ హౌస్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోండి..

దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ, లిటరసీ హౌస్ మహిళలకోసం పలు వృత్తి విద్యా కోర్సులకు ఆహ్వానం పలుకుతోంది. బ్యూటిషియన్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్‌ల తయారీతో పాటు మగ్గం వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పలు కోర్సులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

Hyderabad : మహిళలూ.. జాబ్ అవసరమా? లిటరసీ హౌస్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోండి..

Hyderabad

DDMS Literacy House : ఏదో ఒక కళలో ఆసక్తి ఉండి అది నేర్చుకునే అవకాశం రాక ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ.. లిటరసీ హౌస్ పలు రకాల వృత్తి విద్యా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

PG Admissions : పీజీ ప్రవేశాల అర్హతల సడలింపు.. కెమిస్ట్రీ లేకున్నా ఆరు కోర్సుల్లో అడ్మిషన్

దుర్గాభాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ-లిటరసీ హౌస్ మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇప్పించడం కోసం వివిధ కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. బ్యూటిషియన్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్‌ల వంటి కోర్సులతో పాటు టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు పూర్తి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.  కోర్సుల వివరాల కోసం 8498080599/9951210441/7013457432 నంబర్లలో ఉదయం 10 గం.ల నుంచి 4 గం.ల మధ్య సంప్రదించవచ్చు.

“గర్భిణీ స్త్రీ” కోసం….యూపీ యూనివర్శిటీలో కొత్త కోర్సు

లేదా నేరుగా లిటరసీ హౌస్, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్, హైదరాబాద్ అడ్రస్‌లో సంప్రదించవచ్చని లిట్రసీ హౌస్ సంచాలకులు బి.నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి గల మహిళలు వెంటనే తమను సంప్రదించాల్సిందిగా కోరారు.