హైదరాబాద్ ECIL లో అప్రెంటిస్ పోస్టులు

10TV Telugu News

హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 185 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్ధులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకోవటానికి అభ్యర్దులకు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

ఖాళీల వివరాలు :
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ – 165
టెక్నీషియన్ – 20

విద్యార్హత : అభ్యర్దులు B.E, B.tech  ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్దులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ నిర్వహిస్తారు.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 1, 2020.
దరఖాస్తు చివరి తేది : జనవరి 10, 2020. 

×