వీరుడు స్ఫూర్తి : పాఠ్యాంశంలో ‘అభినందన్’ 

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 05:17 AM IST
వీరుడు స్ఫూర్తి : పాఠ్యాంశంలో ‘అభినందన్’ 

జైపూర్‌: పూర్వకాలంలో వీరుల చరిత్రలను అమ్మమ్మలు.. నాయనమ్మలు పిల్లలకు కథలు.. కథలుగా చెప్పేవారు..ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా బిజీ బిజీ లైఫ్. ఏది తెలుసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. పాఠ్యపుస్తకాలే ఈనాటి పిల్లల లోకం.. అందుకే వీరుల త్యాగాలను పాఠ్యాంశాలలో చేరి వారి చేసిన సాహసాలను.. త్యాగాలను స్కూల్ లెసెన్స్ గా పెడుతోంది ప్రభుత్వం.  ఇంతటి గౌరవం..అర్హత సాధించాలంటే అందరికీ సాధ్యం కాదు..కానీ మన వింగ్ కమాండర్ అభినందన్  వర్థమాన్ కు దక్కింది అంతటి గౌరవం.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ధీరత్వం రాజస్థాన్ స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతస్రా భారత వింగ కమాండర్ అభినందన్‌ వర్థమాన్  ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘పాకిస్తాన్‌ సైనికులకు చిక్కి..ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్‌ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి.

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను గౌరవిస్తూ ఆయన సాహసాన్ని స్కూలు సిలబస్‌లో చేర్చబోతున్నాం’ అని విద్యా మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతస్రా తెలిపారు.  ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్‌–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్‌ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు