Indian Railways : రైల్వేస్ లో 904 ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

Indian Railways
Indian Railways : నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. 904 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఇక ఈ పోస్టులకు అర్హతను ఓ సారి పరిశీలిస్తే టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. అప్లికేషన్ చివరి తేదీ నవంబర్ 3, 2021.
Read More : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 190 ఉద్యోగాలు భర్తీ
ఇక ఈ పోస్టులకు అప్లై చేసేందుకు పరిధిని పరిమితం చేసింది. కేవలం కర్నాటక, గోవాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తమిళనాడులోని ధర్మపురి, సేలం, వేలూర్, మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలకు చెందిన అభ్యర్థుల దరఖాస్తులు మాత్రమే తీసుకుంటోంది. ఇక అర్హత విషయం లోకి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
Read More : కొవిడ్‌తో చనిపోయిన 3వేల మంది కుటుంబాలకు రైల్వే ఉద్యోగాలు
ఇక పోస్టుల వివరాలని చూస్తే.. క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ 217, బెంగళూరు డివిజన్ 230, హుబ్లీ డివిజన్ 237, మైసూరు డివిజన్ 177, సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు 43 ఉన్నాయి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే.. 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. పోస్టుల వివరాల మొదలు పూర్తి సమాచారాన్ని ఈ లింక్ లో చూసి అప్లై చేసుకోచ్చు. https://jobs.rrchubli.in/ActApprentice2021-22/