Garlic Water : ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు?

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి నీరు తోడ్పడుతుంది. వెల్లుల్లి నీరు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను, అలాగే LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

Garlic Water : ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు?

drinking garlic water

Garlic Water : వెల్లుల్లిలో విటమిన్లు B6 , C, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల యొక్క గొప్ప మూలంగా వెల్లుల్లిని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడటంతోపాటు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని నీటితో కలిపినప్పుడు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : వెల్లుల్లి టీతో బోలెడు ప్రయోజనాలు..!

ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ; ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి , రోగనిరోధక శక్తిని పెంచడానికి శక్తివంతమైన సహజ నివారణగా ఉపకరిస్తుంది.

1. జీర్ణశక్తిని పెంచే వెల్లుల్లి నీరు ; వెల్లుల్లి నీరు జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పొట్టలోకి అవసరమైన ఆమ్లంగా ఉపకరిస్తుంది. పిత్త ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

READ ALSO : Garlic Health Benefits : చలికాలంలో జలుబు,దగ్గును నివారించటంతోపాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగించే వెల్లుల్లి!

2. వెల్లుల్లి నీరు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ; వెల్లుల్లి నీరు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్సర్లు, ఇతర జీర్ణశయాంతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

3.రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి నీరు ; వెల్లుల్లి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి, ఇది స్వయం ప్రతిరక్షక పరిస్థితులు ఉన్నవారికి మేలు చేస్తుంది.

READ ALSO : Garlic Tea : చలికాలంలో రోజుకు ఒక కప్పు వెల్లుల్లి టీ తీసుకుంటే అనేక ప్రయోజనాలు!

కొలెస్ట్రాల్‌ ను తగ్గించటంలో వెల్లుల్లి నీరు ;

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి నీరు తోడ్పడుతుంది. వెల్లుల్లి నీరు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను, అలాగే LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

వంటలో వెల్లుల్లి నీరు ఉపయోగించటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లి నీరు ఆహార రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రుచిని ఇచ్చేందుకు వెల్లుల్లిని సూప్‌లు,సలాడ్‌ల వంటి వంటకాలలో ఉపయోగించవచ్చు.

READ ALSO : Garlic : పక్షవాతం ముప్పును తప్పించే వెల్లుల్లి!

వెల్లుల్లి నీరు తయారీ ;

వెల్లుల్లి నీరు సులభంగా తయారు చేయవచ్చు. వెల్లుల్లి నీటిని తయారు చేయడానికి, తాజా వెల్లుల్లి రెబ్బలు నాలుగు తీసుకోవాలి. అలాగే రెండు లవంగాలను తీసుకోవాలి. లవంగాలను మెత్తగా చేయాలి. వెల్లుల్లి రెబ్బలను ముక్కలు చేసి గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని పొయ్యిపైన పెట్టి బాగా మరిగించాలి. తరువాత క్రిందికి దించి వాడకట్టుకోవాలి. చల్లారినతరువాత ఆ నీటిని పరగడుపునే తాగాలి.

READ ALSO : వెల్లుల్లి తినండి.. ఆరోగ్యంగా ఉండండి

అంతేకాకుండా వెల్లుల్లిని రాత్రిపూట చల్లటి నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వడకట్టుకోవాలి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఏదిఏమైనా ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు త్రాగడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచవచ్చు., జీర్ణక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆహారం రుచిని పెంచుకోవచ్చు.