Sickle Cell Disease : సికిల్ సెల్ వ్యాధి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందా? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

సాదారణంగా సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు బాల్యం నుండే ప్రారంభం అవుతాయి. లక్షణాల తీవ్రత అనేది వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య మార్పు ఉంటుంది. వ్యాధి తీవ్రమైన సందర్భంలో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. మరణాలు సంభవిస్తాయి.

Sickle Cell Disease : సికిల్ సెల్ వ్యాధి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందా? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

sickle cell disease

Updated On : June 19, 2023 / 10:46 AM IST

Sickle Cell Disease : సికిల్ సెల్ డిసీజ్ (SCD) అనేది సాధారణంగా వారసత్వంగా వచ్చే వ్యాధి, ఇది హిమోగ్లోబిన్ తోపాటు, శరీరానికి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే ప్రోటీన్‌ను ప్రభావితం చేస్తుంది. జన్యుపరంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహంగా దీనిని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మన దేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 2047 నాటికి సికిల్ సెల్ అనీమియాను నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు.

READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?

సికిల్ సెల్ ఎనీమియా అనేది సికిల్ సెల్ డిజార్డర్‌లో ఒకటి, ఇక్కడ సాధారణంగా గుండ్రంగా మరియు ఫ్లెక్సిబుల్‌గా ఉండే కొన్ని ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇది అనేక సమస్యలకు దారితీసి రక్త ప్రసరణను నిరోధిస్తుంది. ప్రపంచ సికిల్ సెల్ అవేర్‌నెస్ డే ప్రతి సంవత్సరం జూన్ 19న నిర్వహిస్తున్నారు. సికిల్ సెల్ వ్యాధి గురించి, రోగులు, వారి కుటుంబాలు, సంరక్షకులు ఎదుర్కొనే సవాళ్ల గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ రోజును పాటిస్తున్నారు.

అదే క్రమంలో సికిల్ సెల్ వ్యాధి , ఇస్కీమిక్ మరియు హెమరేజిక్ స్ట్రోక్స్‌ల మధ్య ఉన్న సంబంధం విషయంలో నిపుణులు కొన్ని వివరాలు వెల్లడించారు. వారు చెబుతున్న దాని ప్రకారం సికిల్ సెల్ వ్యాధి (SCD) ఇస్కీమిక్ , హెమరేజిక్ స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. మస్తిష్క ఇన్ఫార్క్షన్ అనేది సికిల్ సెల్ వ్యాధి యొక్క సాధారణ సమస్య. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్‌పై సైలెంట్ సెరిబ్రల్ ఇన్‌ఫార్క్షన్ , SCIతో సంబంధం ఉన్న స్ట్రోక్ , మెదడు బలహీనతలకు దారితీస్తుంది. 21 సంవత్సరాల వయస్సులో ఎక్కువ మంది సికిల్ సెల్ వ్యాధి రోగులకు సెరిబ్రల్ ఇన్‌ఫార్క్షన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే 15 లక్షణాలు

మెదడు బలహీనత, బహిరంగ ఇస్కీమిక్ స్ట్రోక్, నిశ్శబ్ద సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్, బహిరంగ రక్తస్రావ స్ట్రోక్, సికిల్ సెల్ వ్యాధిలో ప్రమాద కారకాలు తీవ్రమైన, దీర్ఘకాలిక రక్తహీనతతో పరిస్ధితులు ఏర్పడతాయి. ఎక్కవగా దీర్ఘకాలిక రక్తహీనత, తీవ్రమైన ఛాతీ సమస్యలు, రెటిక్యులోసైటోసిస్ , ఆక్సిజన్ సరిగా అందకపోవటం, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావటం వంటి పరిస్ధితులకు దారితీస్తాయి. కణజాలంలో ఆక్సిజన్ అసమతుల్యత కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి రక్తహీనతకు దారితీస్తుంది.

సికిల్ సెల్ వ్యాధి ఎలా స్ట్రోక్‌కు కారణమవుతుంది ;

SCD రక్తస్రావ స్ట్రోక్‌కు కారణమవుతుందనే దానిపై ఖచ్చితమైన అధారాలు లేవు. SCD ఉన్న వ్యక్తులు మోయా-మోయా అని పిలువబడే బలహీనమైన రక్త నాళాలను కలిగి ఉంటారు. ఇది అనూరిజమ్‌లతో ముడిపడి ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా , సికిల్ బీటా జీరో తలసేమియా వంటి తీవ్రమైన SCD ఉన్న వ్యక్తులు ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వైద్య నిపుణులు చెబుతున్నారు.

READ ALSO :  Control Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడే పానీయాలు !

ఈ ప్రమాదాన్ని నివారించవచ్చా?

క్రమమైన రక్తమార్పిడి అనేది సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలలో నరాల సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ పరిస్ధితిని పూర్తిగా తొలగించలేదు. ఓవర్ స్ట్రోక్, సైలెంట్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ లేదా అసాధారణమైన ట్రాన్స్‌క్రానియల్ డాప్లర్. హైడ్రాక్సీయూరియా వాడకం విషయంలో సరైన సమాచారం లేదు. సాదారణంగా సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు బాల్యం నుండే ప్రారంభం అవుతాయి. లక్షణాల తీవ్రత అనేది వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య మార్పు ఉంటుంది. వ్యాధి తీవ్రమైన సందర్భంలో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. మరణాలు సంభవిస్తాయి.

ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులుగా హైడ్రేషన్, ఆక్సిజన్ థెరపీ, ఆల్కలీన్ ph వంటివి దీర్ఘకాలంలో సహాయపడతాయి. న్యూరోకాగ్నిటివ్ సమస్యలను ముందస్తుగా గుర్తించడం సికిల్ సెల్వ్యా ధి చికిత్సలో మరింత కీలకంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.