కిక్కిచ్చే న్యూస్.. రోజూ మద్యం తాగితే 90ఏళ్లు బతకొచ్చు.. కండీషన్స్ అప్లయ్!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం

  • Published By: veegamteam ,Published On : February 23, 2020 / 07:01 AM IST
కిక్కిచ్చే న్యూస్.. రోజూ మద్యం తాగితే 90ఏళ్లు బతకొచ్చు.. కండీషన్స్ అప్లయ్!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం పోతుంది. ఇలాంటి స్టేట్ మెంట్స్ తరుచూ వినిపిస్తుంటాయి. లిక్కర్ జోలికి వెళ్లొద్దని డాక్టర్లు కూడా చెబుతారు. కానీ.. మందు తాగడం మంచిదే. మద్యం సేవించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. ఏకంగా 90ఏళ్లు బతికే అవకాశముంది అంటే నమ్ముతారా.. అవును ఇది నిజమే అంటున్నారు నెదర్లాండ్స్ సైంటిస్టులు. అయితే.. దీనికి కొన్ని కండీషన్స్ అప్లయ్ అవుతాయి.

మందు మంచిదే:
నెదర్లాండ్స్ లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మద్యపానం మంచిదే అని ఆ సర్వేలో తేలింది. రోజూ కొంత మోతాదాలో మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదని, ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించే ఛాన్స్ ఉందని తేలింది. ఆయుష్షు పెరుగుతుందని, 90ఏళ్ల వరకు జీవించే ఛాన్స్ ఉందని సర్వేలో బయటపడింది.

మద్యపానంతో పెరిగిన ఆయుష్షు:
సైంటిస్టులు.. 5వేల మంది పురుషులు, మహిళలపై రీసెర్చ్ నిర్వహించారు. వీరంతా 1916 నుంచి 1917 మధ్యలో పుట్టిన వారు. 60 ఏళ్ల వయసులో వారందరి మద్యపానం అలవాట్లపై సైంటిస్టులు పరిశోధన చేశారు. అందులో తేలింది ఏమిటంటే.. మద్యం సేవించే వారి ఆయుష్షు మెరుగుపడింది. వారంతా 90ఏళ్ల వరకు జీవించారు. ఏజ్ అండ్ ఏజింగ్ జర్నల్ లో ఈ కథనం వచ్చింది. మద్యపానం అలవాటు ఉన్న వారిలో 34శాతం మంది మహిళలు, 16శాతం మంది పురుషులు 90ఏళ్ల వయసు వరకు జీవించారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే..వారంతా ప్రతి రోజూ 5 నుంచి 15 గ్రాముల ఆల్కహాల్ మాత్రమే సేవించారు. చాలా తక్కువ డోస్ తీసుకున్నారు. ఈ మోతాదు.. చిన్న గాస్ లోని వైన్ తో సమానం. అది లిక్కర్ అయినా కావొచ్చు, వైన్ అయినా కావొచ్చు.. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ. కాగా, 15గ్రాముల కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వారిలో మాత్రం ఫలితాలు వేరుగా ఉన్నాయి. విపరీతంగా మద్యం తాగిన వారు త్వరగానే చనిపోయారు.

కారణం ఏంటో స్పష్టంగా చెప్పలేదు:
తక్కువ డోస్ లో, మెడిసిన్ మాదిరి.. లిమిట్ గా మద్యం తీసుకోవడం వల్లే ఎక్కువ మంది 90ఏళ్ల వయసు వరకు జీవించారని సైంటిస్టులు వివరిస్తున్నారు. మద్యపానం అలవాటుకి, ఆయుష్షు పెరగడానికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనేది మాత్రం సైంటిస్టులు స్పష్టంగా చెప్పలేకపోయారు. హార్మోసిస్ కారణంగా ఆయుష్షు పెరిగి ఉండొచ్చని అంచనా వేశారు. స్మాల్ డోస్ లో లిక్కర్ తీసుకోవడం మంచిదే.. కానీ ఎక్కువ డోస్ లో తీసుకుంటే మాత్రం ప్రమాదం అని హెచ్చరించారు. ఆయుష్షు పెరగడం మాటేమో కానీ.. త్వరగా చావడం మాత్రం ఖాయమని తేల్చి చెప్పారు.

మద్యం తాగడం మొదలుపెట్టొద్దు:
అయితే ఈ స్టోరీ చదివాక.. మద్యపానం అలవాటు లేని వారు సైతం మద్యం తాగడం మొదలు పెట్టే ప్రయత్నం చేయొద్దని సైంటిస్టులు కోరారు. మద్యపానం కరెక్ట్ కాదన్నారు. 60ఏళ్ల వయసు పైబడ్డ వారు డాక్టర్ చెప్పిన మోతాదులో మందు తాగొచ్చని సూచించారు. ప్రతి ఒక్కరు మందు తాగండి అని మేము చెప్పడం లేదన్నారు. ఏదైనా లిమిట్ లో ఉన్నంత వరకు ఎలాంటి ప్రమాదం లేదు, లిమిట్ క్రాస్ అయితే మాత్రం పర్యవసానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.