కరోనా పాజిటివ్ వచ్చి రెస్ట్ తీసుకున్న వారిలో లక్షణాలే లేవంట!

  • Published By: sreehari ,Published On : October 11, 2020 / 02:40 PM IST
కరోనా పాజిటివ్ వచ్చి రెస్ట్ తీసుకున్న వారిలో లక్షణాలే లేవంట!

COVID-19 Symptoms : కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన చాలామంది బాధితుల్లో విశ్రాంతి తీసుకున్నాక ఎలాంటి లక్షణాలే కనిపించలేదని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. మొదట కరోనా పాజిటివ్ తేలిన తర్వాత కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్నవారి శాంపిల్స్ మరోసారి పరీక్షించారు. వారిలో 77 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవని అధ్యయనం తేల్చేసింది.



అంతేకాదు.. 86 శాతం మందిలో ఎవరిలోనూ ప్రధాన కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం లేదా వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు లేవని పేర్కొంది. ఈ తరహా కరోనా బాధితులను సైలెంట్ స్పైడర్స్ గా సైంటిస్టులు తమ అధ్యయనంలో వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు లేనివారు కోలుకున్నాక కూడా వారిలో పాజిటివ్ వస్తే.. అసింపథిటిక్ లక్షణాలు పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు.



యూనివర్శిటీ కాలేజీ లండన్ కు చెందిన ప్రొఫెసర్ Irene Petersen నేతృత్వంలో కరోనా లక్షణాలపై అధ్యయనం జరిగింది. జాతీయ గణాంకాల సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెలాఖరి వరకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన 36వేలకు బాధితుల డేటా ఆధారంగా ఈ అధ్యయనంపై విశ్లేషించారు.



వీరిలో కేవలం 115 మంది మాత్రమే 0.32 శాతంగా కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 27 మందిలో 23.5 శాతంగా కరోనా లక్షణాలు కనిపించాయని, మరో 88 మందిలో 76.5 శాతం అసింపిథిటిక్ లక్షణాలుగా గుర్తించినట్టు అధ్యయనం వెల్లడించింది. మిగితావారిలో దగ్గు, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు 86.1 శాతంగా నమోదైనట్టు గుర్తించారు.