Playing Games : పిల్లలకు చదువెంతముఖ్యమో.. ఆటలు ఆడటమూ అంతే ముఖ్యం

ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు.

Playing Games : పిల్లలకు చదువెంతముఖ్యమో.. ఆటలు ఆడటమూ అంతే ముఖ్యం

Games Help Children

Playing Games : ఎప్పుడూ ఆటలేనా… ముందు వెళ్లి చదువుకో… అంటూ పిల్లలపై అరిచే తల్లిదండ్రులను చూస్తూనే ఉంటాం. కానీ పిల్లలకు చదువెంతముఖ్యమో ఆటలు ఆడటమూ అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. రోజూ ఆడుకునే పిల్లలు చదువులో కూడా టాప్ గా ఉంటారంటున్నారు.

ఒక ముప్పయ్యేళ్ల క్రితం స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి, కాళ్లు కూడా కడుక్కోకుండా, స్నాక్స్ కూడా తినకుండా గ్రౌండ్ కి ఆడుకోడానికి పరిగెత్తేవాళ్లు పిల్లలు. ఎక్కడ, ఏ గల్లీలో చూసినా క్రికెట్ ఆడుతూనో, చార్పత్తాలుఆడుతూనో కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు పిల్లలను చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్లకు ఆటలే లేవు. స్కూల్ నుంచి రాగానే గ్రౌండ్ కి వెళ్లడానికి బదులు ఫోన్లు పట్టుకుంటున్నారు. స్కూల్ లో కూడా ఆట స్థలాల్లో విహంగాల్లా విహరించడానికి బదులు తరగతి గదులనే పంజరాల్లో బందీలై పోతున్నారు.

READ ALSO : Flesh Eating Bacteria : మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా .. ప్రతీ ఏటా పలువురు మృతి

ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు.

మెదడు కూడా బంధీనే

ఇప్పుడు పిల్లలకు చదువు తప్ప మరో ధ్యాస లేదు. ఆరుబయట ఆటలు లేవు. క్లాస్ రూమ్ లో చదువు.. ఆ తర్వాత స్టడీ అవర్స్. ఇంటికి వచ్చిన తరువాతా చదువే. ఇక ఆడుకునే టైం ఎక్కడిది..? లేకపోతే ఎక్కువ మంది పిల్లలు మొబైల్స్ తో స్నేహం చేస్తున్నారు. గంతులేస్తూ ఆడుకోవాల్సిన వయసులో మొబైల్లో గేమ్స్ కు అతుక్కుపోతున్నారు. అందుకే పిల్లల గ్రహణశక్తితగ్గుతుందంటున్నారు నిపుణులు. ఆటలు శారీరక ఆరోగ్యానికే గాక చదువుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ కి చెందిన పరిశోధకులు.

READ ALSO : Human Embryo : కృత్రిమ పిండం.. స్త్రీ, పురుషుల కలయిక లేకుండానే పిండాన్ని సృష్టించారు, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతం

ఆటలతోనే జవం.. జీవం

పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా అంతే ముఖ్యం. శారీరకంగా దృఢంగా ఉండడానికి, ఆరోగ్యం కోసం, ఎదుగుదల కోసం ఆటలు శారీరక వ్యాయామంగా పనిచేస్తాయి. ఇప్పుడు కొత్త పరిశోధన ప్రకారం పిల్లలు చదువులో రాణించాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. సమస్యను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత మెరుగుపడతాయి. స్కూల్ పిల్లలకు మాత్రమే కాదు.. కాలేజీ విద్యార్థుల్లో కూడా ఇటువంటి ప్రయోజనాలుంటాయి.

READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

అందుకే పిల్లల్లో శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడేట్టుగా ప్రోత్సహించాలి. ప్రతి స్కూల్ లోనూ చదువుకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో శారీరక వ్యాయామానికి ఉపయోగపడే క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిస్తున్నారు పరిశోధకులు. అప్పుడే పిల్లలు చదువుకునే బొమ్మల్లా కాకుండా జీవంతో చురుకైన వ్యక్తులుగా ఎదుగుతారని చెబుతున్నారు. తల్లిదండ్రులూ… వింటున్నారా.. మరి.