watermelon : పుచ్చకాయ తిన్న తర్వాత ఈ మూడు అస్సలు తినకండి
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మూడు ఆహార పదార్ధాలు తినకూడదట. అవేంటంటే?

watermelon
watermelon : పుచ్చకాయ వేసవిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని ఇస్తుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరగవచ్చు.
Ridge Gourd : వేసవిలో బీరకాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు !
పుచ్చకాయలో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియంలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. పుచ్చకాయ తినడం వల్ల కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, కడుపునొప్పి లాంటి సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయని వైద్యులు చెబుతారు. క్యాన్సర్ బారిన పడకుండా కూడా పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తినడమే కాదు ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయతో మూడు రకాల పదార్ధాలను తినకూడదట. ఈ పండులో అధికంగా ఉండే నీటితో పాటు ఫైబర్ అందుకు కారణమట.
పుచ్చకాయ తిన్న తరువాత ప్రొటీన్ ఫుడ్ తీసుకోకూడదట.. పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్ధం ఉంటాయి. అటువంటప్పుడు ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుందట. దాని వల్ల జీర్ణ వ్యవస్థకు హాని జరుగుతుందట.
పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తీసుకోవడం చాలా హాని చేస్తుందట. పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. పాలు, విటమిన్ సి ఈ రెండింటి కలయిక వల్ల ఉబ్బరం కలుగుతుందట. అలా జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. కాబట్టి పుచ్చకాయ ఎప్పుడు తిన్నా కూడా 30 నిముషాల వరకూ ఇంకేమీ తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.