Pontifical high mass: నేడు హైదరాబాద్‌లో ‘క్యాథలిక్’ వేడుక.. హాజరుకానున్న ఇద్దరు కార్డినల్స్, 15 మంది బిషప్స్.. 500 మంది మతగురువులు

 హైదరాబాద్‌లో ఇవాళ అతి పెద్ద క్యాథలిక్ వేడుక జరగనుంది. కొత్తగా నియమితులైన ‘కార్డినల్’ పూల ఆంథోనీతో పాటు ముంబై ‘కార్డినల్’ ఒస్వాల్డ్ గ్రేసియస్, 15 మంది బిషప్స్, 500 మంది మత గురువులు ఇందులో పాల్గొంటారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ వీధిలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ క్యాంపస్ లో ఈ వేడుక జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో వేలాదిమంది క్రైస్తవ క్యాథలిక్ లు పాల్గొననున్నారు.

Pontifical high mass: నేడు హైదరాబాద్‌లో ‘క్యాథలిక్’ వేడుక.. హాజరుకానున్న ఇద్దరు కార్డినల్స్, 15 మంది బిషప్స్.. 500 మంది మతగురువులు

Pontifical high mass

Pontifical high mass: హైదరాబాద్‌లో ఇవాళ అతి పెద్ద క్యాథలిక్ వేడుక జరగనుంది. కొత్తగా నియమితులైన ‘కార్డినల్’ పూల ఆంథోనీతో పాటు ముంబై ‘కార్డినల్’ ఒస్వాల్డ్ గ్రేసియస్, 15 మంది బిషప్స్, 500 మంది మత గురువులు ఇందులో పాల్గొంటారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ వీధిలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ క్యాంపస్ లో ఈ వేడుక జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో వేలాదిమంది క్రైస్తవ క్యాథలిక్ లు పాల్గొననున్నారు.

ఆగస్టు 27న వాటికన్ సిటీలో జరిగిన వేడుకలలో ఏపీలోని క‌ర్నూలు జిల్లాకు చెందిన పూల అంథోనీ పోప్ ఫ్రాన్సిస్ కార్డిన‌ల్‌గా నియమించిన సంగతి విదితమే. కార్డిన‌ల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిష‌ప్‌ ఆయ‌నే. మత సంబంధ వ్య‌వ‌హారాల్లో పోప్‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేందుకు నియ‌మితులైన వారిని కార్డిన‌ల్స్ అంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ జరగనున్న వేడుక గురించి కార్యక్రమ మీడియా కమిటీ కన్వీనర్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ.. 2000 సంవత్సరాల తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తెలుగు కార్డినల్ గా పూల అంథోని నియమితుడయ్యారని చెప్పారు.

ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా వేడుక నిర్విహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోస్తలిక్ మున్షియో, కార్యదర్శులు వికార్ జనరల్ గాబ్రియెల్ పెన్సే, బెర్హంపూర్ బిషప్ శరత్ చంద్ర నాయక్, బెంగళూరు వికార్డ జనరల్ సి.ఫ్రాన్సిస్, బల్లారి బిషప్ హెన్రీ డినేజా హాజరుకానున్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 21 మందిని కొత్తగా కార్డినల్స్ ప్రకటించగా వారిలో ఇద్దరు భారతదేశానికి చెందినవారు ఉన్నారని గుర్తు చేశారు. వారిలో మొదటివారు పూల అంథోని అని, రెండవ వారు గోవా బిషప్ ఫిలిప్నారి అని చెప్పారు.

Shanghai Cooperation Organisation: ఎస్‌సీవో సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సు.. ఉజ్బెకిస్థాన్‌కు నేడు మోదీ, జిన్ పింగ్, పుతిన్