Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి

Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి

Kishan Reddys Sensational Comments On Ktr

union minister Kishan Reddy : హైదరాబాద్ అంతా పొలిటికల్ హీట్ తో కుతకుతలాడుతోంది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యక్రమాల సమావేశాలు..మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యక్రమాలు. ఇలా హైదరాబాద్ నగరం అంతా అటు కాషాయ జెండాలు..గులాబీ జెండాలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు విషయంలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. ఫ్లెక్సీలపై..హోర్డింగ్ ల ఏర్పాటుపై ఇరు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు కాషాయ,గులాబీ నేతలు. దీంట్లో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని..మంత్రి స్థానంలో ఉన్న కేటీఆర్ భాష సరిగా లేదని..అంత అహంకారమా? అంటూ ప్రశ్నించారు. ప్రజా ధనంతో టీఆర్ఎస్ ప్రభుత్వం హోర్డింగ్లు ఏర్పాటు చేసింది అంటూ విమర్శలు సంధించారు.

Also read : Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ

కొడుకు కేటీఆర్ సీఎం కాలేడనే నిరాశతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేసీఆర్ స్వాగతం పలకడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ వల్ల సీఎం కేసీఆర్‌కు కొడుకు సీఎం కాలేడనే భయం పట్టుకుందని, సీఎం కుర్చి పోతుందని నిరాశలో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ప్రభుత్వ డబ్బులతో బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో హోర్డింగులు పెట్టారని ఆరోపించారు. ఓ పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు మరో పార్టీ ఇలా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సీఎం దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కుటుంబ పార్టీ.. ఎంఐఎంతో కలిసి దిగజారే రాజకీయాలు చేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్య పద్దతిలో నడుచుకుంటామని తెలిపారు. ఆయన పని అయిపోయిందంటూ పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు కుటుంబ రాజకీయాలు చేయదని పేర్కొన్నారు.

Also read : Raghunandan Rao: తెలంగాణకు మేమున్నాం అని భరోసా ఇస్తాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

తెలంగానలో బీజేపీ జాతీయ కార్యక్రమాలు నిర్వహించటంతో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అంటూ ఎద్దేవా చేశారు. కొడుకు కేటీఆర్ సీఎం కాలేడనే నిరాశతోనే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలకడం లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.బీజేపీ వల్ల సీఎం కేసీఆర్‌కు కొడుకు సీఎం కాడనే భయం పట్టుకుందని ప్రజల డబ్బులతో హైదరాబాద్‌ నగరంలో హోర్డింగులు పెట్టి..దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు మరో పార్టీ ఇలా చేయడం దురదృష్టకరమని అన్నారు. తాము ప్రజాస్వామ్య పద్దతిలో నడుచుకుంటామని తెలిపారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడే రోజు వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు.