Congress president election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్న శశి థరూర్?

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీ బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'లో ఆయన తాజాగా ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికకు కూడా పోలింగ్ నిర్వహించడానికి పార్టీ ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అన్నారు.

Congress president election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్న శశి థరూర్?

Congress president election

Congress president election: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీ బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’లో ఆయన తాజాగా ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికకు కూడా పోలింగ్ నిర్వహించడానికి పార్టీ ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అన్నారు.

అలాగే, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఆసక్తి చూపే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ కూడా ఆ రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ లోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడి కోసం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కూడా ఎన్నిక జరిగితే భారత్ వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని శశి థరూర్ అన్నారు.

కన్జర్వేటివ్ నాయకుడిని, ప్రధాని పదవి కోసం ఆ పార్టీ నిర్వహిస్తోన్న ఎన్నిక ప్రక్రియ ఆ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది చెప్పారు. ఎన్నిక ముందు అభ్యర్థులు తమ ప్రణాళికలను పార్టీ ముందు ఉంచాలని, దీంతో ఆ విషయం ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం అంశంలో ప్రస్తుతం కొంత సందిగ్ధత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఈ పోలింగ్ పార్టీ కార్యకర్తలపైనే కాకుండా దేశ ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

AAP vs BJP: ‘మీరే అవినీతికి పాల్పడ్డారు’.. అంటూ గత రాత్రంతా అసెంబ్లీ వద్ద పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు