Very Severe Cyclone Biparjoy: తుపాన్ ఎఫెక్ట్: సముద్ర తీరంలో ఎతైన అలలు..భారీవర్షాలు

బిపర్‌జాయ్ తుపాన్ ముప్పు రోజురోజుకు తీవ్రమవుతోంది.ఈ తుపాన్ వల్ల సముద్రతీరంలో ఎతైన అలలు, భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ ముప్పు పెరుగుతున్నందున ఐఎండీ అలర్ట్ ప్రకటించింది.

Very Severe Cyclone Biparjoy: తుపాన్ ఎఫెక్ట్: సముద్ర తీరంలో ఎతైన అలలు..భారీవర్షాలు

Very Severe Cyclone Biparjoy

Very Severe Cyclone Biparjoy: బిపర్‌జాయ్ తుపాన్ ముప్పు తీవ్రమవుతోంది. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుపాన్ మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. బిపర్‌జాయ్ తుపాన్ తూర్పు, మధ్య అరేబియా సముద్రానికి సమీపంలో ఉందని, దీని వల్ల అరేబియా సముద్ర తీరంలోని వల్సాద్ నగర తితాల్ బీచ్ వద్ద ఎతైన అలలు కనిపించాయని ఐఎండీ అధికారులు చెప్పారు.ఈ తుపాన్ వల్ల సముద్రతీరంలో ఎతైన అలలు, భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ ముప్పు పెరుగుతున్నందున ఐఎండీ అలర్ట్ ప్రకటించింది.

UK Ex PM Boris Johnson Resigns As MP:యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా

తుపాన్ ముప్పు పొంచి ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా తితాల్ బీచ్ వద్ద పర్యాటకులు రాకుండా మూసివేశారు.‘‘చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని చెప్పాం, దీంతో వారంతా తిరిగి వచ్చారు. అవసరమైతే సముద్రతీరంలో ఉన్న గ్రామాల ప్రజలను తరలిస్తాం. వారికి షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాం…జూన్ 14వతేదీ వరకు పర్యాటకులు రాకుండా తితాల్ బీచ్‌ను మూసివేశాం’’ అని వల్సాద్ తహసీల్దార్ టీసీ పటేల్ చెప్పారు.

Indonesia volcano erupted: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం పేలింది…

వచ్చే 36 గంటల్లో బిపర్‌జాయ్ తుపాను మరింత బలపడే అవకాశం ఉన్నందున, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌ల తీరంలోని సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ మత్స్యకారులకు సూచించింది.కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్‌లో శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఈ తుపాన్ వల్ల పలు సముద్ర తీర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.