UN ఎన్విరాన్మెంట్ అంబాసిడర్‌గా 17 ఏళ్ల గుజరాత్ బాలిక

గుజరాత్ లోని సూరత్ కు చెందిన 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ గుర్తింపు సాధించింది. పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో అనుక్షణం పనిచేసిన కృషికి ఫలితం దక్కింది. ఆమె ఆలోచనలు, విజన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌కు సైతం ఆశ్చర్యం కలిగించాయి. వెంటనే ఆమెను యూఎస్ తరపున భారత్‌లో ఎన్విరాన్మెంట్ రీజనల్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు యూఎన్ ప్రకటించింది.
గుజరాత్‌కు చెందిన ఖుషి చిందాలియా వయసు 17 సంవత్సారాలు. ఖుషీకి పర్యావరణమంటే తగని ఖుషీ. చిన్నప్పటి నుంచే పర్యావరణం..ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. మనిషి వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోందని చిన్ననాటే గుర్తించిన ఆమె ఆవేదన చెందేంది. దీంతో ఆమె పర్యావరణానికి సంబంధించిన అంశంపై ఏదన్నా చేయాలని నిర్ణయించుకుంది. దాని కోసం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేది. ఎన్నో విషయాలను తెలుసుకునేది.
అలా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పలు విషయాలను తెలుసుకని పర్యావరణ పరిరక్షణే థ్యేయంగా పనిచేస్తోంది. ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలా కేవలం 17 సంవత్సరాలకే ఖుషీ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం – తుంజా ఎకో-జనరేషన్ భారతదేశ ప్రాంతీయ రాయబారిగా నియమించే స్థాయికు చేరుకుంది.పట్టుదల అంకిత భావం ఉంటే సాధించలేదనిది ఏదీ లేదని నిరూపించింది.
ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా టుంజా ఎకో-జెనరేషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీనికోసం దరఖాస్తులు అందజేయాల్సిందిగా ఆన్లైన్లో కోరుతుంది. ఈ సమయంలోనే ఖుషీ యూఎన్ ఎన్విరాన్మెంటల్ అంబాసిడర్ స్థానానికి అప్లై చేసుకుంది. అందులో ప్రకృతి పట్ల ఆమె ఆలోచనలు, ఆశయాలను పొందుపరిచింది. పర్యావరణ రక్షణకు తాను ఏ విధంగా పాటుపడాలనుకుంటోందో అన్ని విషయాలను సవివివరంగా తెలిపింది. ఖుషీ అలోచనలను..తపనను గుర్తించిన యూఎస్ ఖుషీని ఎంతగానో మెచ్చుకుంది యూఎన్.. వెంటనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ రీజనల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా ఆమెను నియమించింది. దీంతో ఖుషీ తన కల నెరవేరినందుకు యూఎన్ తన తపనను గుర్తించినందుకు ఖుషీ ఖుషీ అయిపోయింది.
యూఎన్ తరపున పర్యావరణ పరిరక్షణకు ఎంపిక కావడంపై ఖుషీ మాట్లాడుతూ.. తనపై యునైటెడ్ నేషన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను..ఇది ఓ మహత్తర బాధ్యత..దానిని నిర్వర్తించేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తాను. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లే అవకాశం లేదు కాబట్టి..ఆన్లైన్లోనే పర్యావరణంపై అందరికీ అవగాహన కల్పించేందుు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
చిన్నపుడు తాము ఉండే ప్రాంతాల్లో ఉండే పచ్చదనాన్ని నిత్యం పరిశీలించేదాన్ని. పచ్చని చెట్లపై పక్షలు వచ్చి వాలి సందడి చేస్తుంటే చూసి చాలా చాలా సంతోషపడేదాన్ని. అవి ఎంత సంతోషంగా ఉన్నాయో కదాని అనుకునేదాన్ని. కానీ కాలక్రమేణా ఆ పచ్చదనం పోయి కాంక్రీటు జంగిల్ లా సిటీ మారిపోతుండటాన్ని చూశాను. పచ్చదనం మాయంకావటంతో పక్షులు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో నాకు చాలా బాధవేసేది. అప్పుడే అనుకున్నాను..పచ్చదనం ఉంటేనే కదా పక్షులు సురక్షితంగా ఉంటాయి. పచ్చదనం చూసినప్పుడు మాలో కలిగిన ఆనందం..మాటలకు అందని సంతోషకరమైన భావ నేటి కాంక్రీటు జంగిల్ ను చూసినప్పుడు కలగలేదు. దీనకి కారణం పచ్చదనమేనని అప్పుడే గ్రహించాను. అందుకే పర్యావరణం కోసం తాను కృషి చేయాలని నిర్ణయించుకున్నానని..తన కృషి ఫలించి..నన్ను యూఎన్ గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని నాపై యూఎన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పంది ఖుషీ.
Gujarat: Khushi Chindaliya, 17-year-old girl from Surat has been appointed as Regional Ambassador for India by United Nations Environment Programme Tunza Eco-Generation.
She says, “Impassioned about conserving environment. I appeal everyone to spread awareness to safeguard it.” pic.twitter.com/sRhkLr5C1Z
— ANI (@ANI) September 22, 2020