Pakistan : పాక్ లో క్రైస్తవుల స్వాధీనంలో హిందూ దేవాలయం..తిరిగి తెరుచుకోనున్న 1200 ఏళ్లనాటి వాల్మీకి ఆలయం

పాకిస్థాన్ లో ఎట్టకేలకు ఓ పురాతన హిందూ దేవాలయం క్రైస్తవులు చేతుల నుంచి 22 ఏళ్ల తరువాత విముక్తి పొందింది. 1200 ఏళ్లనాటి ఆ పురాతన దేవాలయం తిరిగి తెరుచుకోనుంది. కోర్టులో సుదీర్ఘ కాలం పోరాటం తరువాత క్రైస్తవుల నుంచి విముక్తి పొందిన ఆ ఆలయం ధర్మాసనం ఆదేశాలతో పూర్తిస్థాయిలో తిరిగి తెరుచుకోనుంది.

Pakistan : పాక్ లో క్రైస్తవుల స్వాధీనంలో హిందూ దేవాలయం..తిరిగి తెరుచుకోనున్న 1200 ఏళ్లనాటి వాల్మీకి ఆలయం

Ancient 1,200 year old Hindu temple in Pakistan to be restored : పాకిస్థాన్ లో ఎట్టకేలకు ఓ పురాతన హిందూ దేవాలయం క్రైస్తవులు చేతుల నుంచి విముక్తి పొందింది. 1200 ఏళ్లనాటి ఆ పురాతన దేవాలయం తిరిగి తెరుచుకోనుంది. కోర్టులో సుదీర్ఘ కాలం పోరాటం తరువాత క్రైస్తవుల నుంచి విముక్తి పొందిన ఆ ఆలయం ధర్మాసనం ఆదేశాలతో పూర్తిస్థాయిలో తిరిగి తెరుచుకోనుంది.

లాహోర్‌లో ఉన్న వాల్మీకి ఆలయాన్ని ఆక్రమించుకున్న ఓ క్రైస్తవ కుటుంబం నుంచి దానిని చట్టం ప్రకారం దక్కించుకున్నామని దానిని పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పాకిస్థాన్‌లో మైనారిటీ ప్రార్థనా స్థలాలను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ బాడీ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) బుధవారం (ఆగస్టు 3,2022) వెల్లడించింది. లాహోర్‌లో ప్రసిద్ధి చెందిన అనార్కలి బజార్‌ సమీపంలో ఉన్న వాల్మీకి ఆలయాన్ని ఓ క్రైస్తవ కుటుంబం నుంచి గత జులైలో బోర్డు స్వాధీనం చేసుకుంది. లాహోర్‌లోని కృష్ణుడి ఆలయంలోపాటు వాల్మీకి ఆలయం కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉంది.

Also read : పాకిస్థాన్ లో మరుగుదొడ్డిగా వాడుతున్న 1000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం..!!

ఈ దేవాలయం విషయంలో క్రైస్తవం నుంచి హిందూమతంలోకి మారామని చెబుతున్న ఓ కుటుంబం.. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే గత 22 ఏళ్లుగా ఈ ఆలయంలోకి అనుమతి ఇస్తోంది. మిగిలిన ఎవ్వరిని అనుమతించటంలేదు. త్వరలోనే ఈ ఆలయాన్ని పునరుద్ధరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈటీపీబీ అధికార ప్రతినిధి తెలిపారు. 100మందికిపైగా హిందువులు, సిక్కులు, క్రైస్తవ నేతలు ఈ ఆలయం వద్ద సమావేశమయ్యారని..హిందువులు తమ మతపరమైన ఆచారాలను ఆలయంలో నిర్వహించారని తెలిపారు.

ఈ ఆలయం 22 సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబం చేతిలోనే ఉండిపోయింది. ఈ ఆలయానికి సంబంధించిన స్థలం తమదేనంటూ సదరు క్రైస్తవ కుటుంబం 2010-11లో కోర్టులో కేసు వేసింది. దీంతో అప్పటి నుంచి న్యాయపోరాటం జరుగుతూనే ఉంది. ఈక్రమంలో 22 ఏళ్ల తరువాత ఈటీపీబీకి అనుకూలంగా తీర్పు రావడంతో ఆలయాన్ని ఆక్రమించుకున్న క్రైస్తవ కుటుంబాన్ని అక్కడి నుంచి తరలించి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Also read : Hindu Temple: పాకిస్తాన్‌లో ధ్వంసమైన హిందూ దేవాలయం