Pfizer Covid Vaccine : ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లు దాటిన పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ పిల్లలకు ఫైజర్ టీకా ఇవ్వనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇటీవల 12 నుంచి 15ఏళ్ల లోపు వారిపై జరిపిన క్లీనికల్ ట్రయల్స్ లో ఫైజర్ వ్యాక్సిన్ 100శాతం ప్రభావవంతంగా పని చేయడంతో కెనడా ఈ నిర్ణయం తీసుకుంది.

Pfizer Covid Vaccine : ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Pfizer Covid Vaccine

Pfizer Covid Vaccine : కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లు దాటిన పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ పిల్లలకు ఫైజర్ టీకా ఇవ్వనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇటీవల 12 నుంచి 15ఏళ్ల లోపు వారిపై జరిపిన క్లీనికల్ ట్రయల్స్ లో ఫైజర్ వ్యాక్సిన్ 100శాతం ప్రభావవంతంగా పని చేయడంతో కెనడా ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, 12 నుంచి 15 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తొలి దేశం కెనడానే. ప్రపంచంలో మరే దేశంలోనూ పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. 16ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇప్పటికే కెనడా ఆమోదం తెలిపింది.

కెనడాలో రికార్డు స్థాయిలో 1.2 మిలియన్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో 19ఏళ్ల వయసులోపు ఉన్నవారిలో 20శాతం మంది కోవిడ్ బారినపడ్డారు. కాగా, కరోనా కారణంగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవడం, మరణించడం వంటివి చాలా తక్కువ. కరోనా బారిన పడ్డా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా రాలేదు. యంగర్ ఏజ్ గ్రూప్ వారి విషయానికి వస్తే ఫైజర్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనది, ప్రభావంతమైనది అని కెనడా ఆరోగ్యశాఖ చెప్పింది.

కరోనా సమస్యకి ఏకైక పరిష్కారం వ్యాక్సిన్ మాత్రమే. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కాగా, 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పిల్లలు ఇంకా వ్యాక్సిన్ ఇచ్చింది లేదు.