Canada: కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు

కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ అయినట్లు సర్వే వెల్లడించింది. మే 2021 తర్వాత నుంచి ఉద్యోగాలు చాలా వరకూ ఖాళీ అయినట్లు తెలిసింది. మే 2022కు సంబంధించి నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వేలో పరిశ్రమల్లో శ్రామిక కొరత ఏర్పడినట్లు తెలిపింది.

Canada: కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు

canada jobs

 

 

Canada: కెనడాలో భారీగా ఉద్యోగవకాశాలు ఉన్నాయట. అక్కడి జనాభా మొత్తం ఉద్యోగాల్లో ఉండగానే 10లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ అయినట్లు సర్వే వెల్లడించింది. మే 2021 తర్వాత నుంచి ఉద్యోగాలు చాలా వరకూ ఖాళీ అయినట్లు తెలిసింది. మే 2022కు సంబంధించి నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వేలో పరిశ్రమల్లో శ్రామిక కొరత ఏర్పడినట్లు తెలిపింది.

దీని ఫలితంగానే కెనడాకు వయస్సుల వారీగా వలసలు పెరిగినట్లు తెలుస్తుంది. కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో పర్మినెంట్ రెసిడెన్షియల్‌షిప్‌ను అందించేందుకు సిద్ధంగా ఉంది. 2024 నాటికి 4.5లక్షల మందిని పిలుచుకునేందుకు గానూ కెనడా రెడీగా ఉందని సర్వే పేర్కొంది.

నిరుద్యోగం తక్కువగా ఉండటంతో పాటు ఉద్యోగవకాశాలు ఎక్కువ ఉండటంలో వలసలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. మరో సర్వే ప్రకారం.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే మరిన్ని పోస్టులు అందుబాటులో ఉన్నట్లు స్పష్టమైంది. అల్బెర్టా, అంటారియలో ప్రతి ఓపెన్ పొజిషన్‌కు 1.1 మంది నిరుద్యోగులు ఉన్నారు.

ఈ సంఖ్య మార్చిలో 1.2 ఉండగా.. అంతకుముందు సంవత్సరం 2.4గా ఉంది. వృత్తిపరమైన, శాస్త్రీయ, సాంకేతిక సేవలు, రవాణా, గిడ్డంగులు, ఫైనాన్స్, భీమా, విశ్రాంతి, వినోదం, రియల్ ఎస్టేట్ అన్నీ విభాగాల్లో రికార్డ్ స్థాయిలో అధిక ఖాళీలను సూచిస్తున్నాయి.

RBC సర్వే ప్రకారం, కెనడియన్లలో మూడింట ఒక వంతు మంది ముందుగానే పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 10 మందిలో ముగ్గురు మహమ్మారి కారణంగా వారి పదవీ విరమణను ఆలస్యం చేస్తున్నారు.