Coronavirus Updates: చైనాలోనే కాదు.. జపాన్‌లోనూ కరోనా విజృంభణ.. 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికేసులంటే?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ పలు రకాలుగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.37లక్షల పాజిటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వైరస్ కారణంగా 1,396 మంది మరణించారు.

Coronavirus Updates: చైనాలోనే కాదు.. జపాన్‌లోనూ కరోనా విజృంభణ.. 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికేసులంటే?

Corona virus

Coronavirus Updates: చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మరోసారి కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రమాదకర స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బీఎఫ్.7 వేరియంట్ ప్రభావంతో ఆ దేశంలో కొవిడ్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజు ఆదేశంలో 3,030 కొవిడ్ కేసులు నమోదయ్యాయని చైనా అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. బుధవారం ఎవరూ చనిపోలేదని, మంగళవారం ఐదుగురు చనిపోయారని అక్కడి అధికారలుు తెలిపారు. కానీ అక్కడ పరిస్థితి వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్ బాధితులతో ఆస్పత్రులన్నీ కిక్కిరిస్తున్న పరిస్థితి ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ కూడా అంగీకరించింది. ఇదిలాఉంటే చైనాతో పాటు జపాన్ లోనూ కొవిడ్ మళ్లీ కోరులుచాస్తుంది.

Corona Virus In China: వచ్చే ఏడాది చైనాలో కరోనా విధ్వంసం తప్పదా? భయానక విషయాలు వెల్లడించిన నిపుణులు

జపాన్ దేశంలో ఊహించని స్థాయిలో కొవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 2.60లక్షల కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. వీరిలో 296 మంది మరణించారు. మరోవైపు అమెరికాలో కూడా గడిచిన 24గంటల్లో 50వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 323 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24గంటల్లో దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాల్లోసైతం కొవిడ్ పాజిటివ్ కేసులు 50వేలకుగా నమోయ్యాయి. బ్రెజిల్ లో కొవిడ్ కారణంగా 197మంది మరణించారు. భారతదేశం విషయానికొస్తే గడిచిన 24గంటల్లో 145 కేసులు నమోదయ్యాయి.

Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ పలు రకాలుగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.37లక్షల పాజిటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వైరస్ కారణంగా 1,396 మంది మరణించారు. ఈ గణాంకాల ప్రకారం.. కొవిడ్ ఉధృతి రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.