Covid-19 Effect‌ : కరోనా ప్రభావంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తగ్గిన మనిషి ఆయుర్దాయం

కరోనా మహమ్మారి ప్రభావంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనిషి ఆయుర్దాయం తగ్గిందని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో తేలింది.

10TV Telugu News

Covid-19 Effect‌..life expectancy since World War II : కరోనా మహమ్మారికి ముందు కరోనా తరువాత రోజులు అనేలా తయారైంది ప్రపంచ దేశాల పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దాదాపు అన్ని దేశాలమీద కోవిడ్ ప్రభావం పడింది. ఆర్థికంగాను..ప్రాణనష్టంగా అన్ని దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి ఈనాటికి కూడా. కొన్ని దేశాల్లో ఆకలి కేకలు కడు హృదయవిదాకరంగా ఉన్నాయి. చిన్నదేశాలు, పేద దేశాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. చిన్నారుల్ని చదువులకు దూరం చేసిందీ మహమ్మారి. ఇలా అన్ని వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి పారేసింది.దీంతో దేశాల కోలుకోవటానికి నానా పాట్లు పడుతున్నాయి.

Read more:Female Covid cases: మహిళలపై కరోనా ప్రభావం.. గతంలో కంటే పెరిగిన కేసులు

కరోనా కేవలం ఆర్థిక వ్యవస్థల్నే కాదు మనిషి ఆయుర్ధాన్ని కూడా మార్చివేసిన పరిస్థితి ఏర్పడిందని ఈ ప్రభావంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనుషుల ఆయుర్దాయం తగ్గిందని ఆక్స్ ఫర్డ్ వర్శిటీ అధ్యయనం వెల్లడించింది.గత రెండేళ్లుగా కోవిడ్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో మనం చూస్తేనే ఉన్నాం. దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఆత్మీయుల్ని కోల్పోయిన ఆవేదన చెందుతున్నారు. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాధలుగా మారారు.

తగ్గిన ఆయుర్ధాయం..29 దేశాల్లో పరిశోధకుల అధ్యయనం..
కరోనా ప్రభావం ఎంతగా పడిందీ అంటే..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనుషుల సగటు ఆయుర్దాయం కొవిడ్ కారణంగా భారీగా తగ్గినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికా ప్రజల సగటు ఆయుర్దాయం 2020లో రెండేళ్లు తగ్గినట్లు ఈ సర్వేలో తేలింది.ఈ విషయంపై అధ్యయనాన్ని పరిశోధకులు 29 దేశాల్లో నిర్వహించారు. ఇంగ్లండ్, ఇటలీ, బెల్జియం, వేల్స్, వంటి యూరోపియన్ దేశాలతో అమెరికా, చిలీ దేశాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ 29 దేశాల్లో 27 దేశాల ప్రజల ఆయుర్దాయం 2019తో పోలిస్తే ఆరు నెలలు తగ్గినట్లు గుర్తించారు. ఈ దేశాల్లో అధికారిక కొవిడ్ మృతుల సంఖ్య కారణంగానే ఆయుర్దాయం తగ్గినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం అంచనా వేసింది. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా మరణించారు. కరోనా వివిధ దేశాల్లో సృష్టించిన విధ్వంసానికి ఇది నిదర్శనమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రిద్ధీ కశ్యప్ అన్నారు.

Read more: Pregnants Must Take Vaccine : కరోనా వల్ల ప్రసవం ముందే అయ్యే అవకాశం..గర్భిణులు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండీ

మహిళల కంటే..పురుషుల ఆయుర్దాయమే ఎక్కువ
అధ్యయనం నిర్వహించిన దేశాల్లో మహిళలతో పోలిస్తే.. పురుషుల ఆయుర్దాయమే ఎక్కువగా తగ్గినట్లు తేలింది. అమెరికా పురుషుల ఆయుర్దాయం 2.2 ఏళ్ల మేర తగ్గినట్లు గుర్తించారు. 15 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం ఎక్కువగా తగ్గిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 11 దేశాల్లో మాత్రం పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం తగ్గినట్లు గుర్తించారు.

Read more:గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకుంటే మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే?

ఇక వయసు పరంగా చూసుకుంటే.. అమెరికాలో జనాభా అధికంగా ప్రభావితం కాగా.. యూరప్ దేశాల్లో 60 ఏళ్లకు పైబడిన వారి ఆయుర్దాయం తగ్గిందని అధ్యయనంలో తేలింది. కరోనా ప్రభావంపై మరింత స్పష్టమైన అధ్యయనం చేయడానికి ఇతర మధ్య, తక్కువ ఆదాయం గల దేశాలు తమ అధికారిక కరోనా మృతుల డేటా ఇవ్వాలని డాక్టర్ రిద్ధీ కశ్యప్ అన్నారు.ఆయుర్దాయం, పీరియడ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అని కూడా అంటారు, ప్రస్తుత మరణాల రేటు వారి జీవితమంతా కొనసాగితే.. నవజాత శిశువు నివసించే సగటు వయస్సును సూచిస్తుంది.