Sri Lanka : శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం

సేంద్రీయ సాగు కోసం వెంపర్లాడటం.. కోవిడ్ ప్రభావంతో టూరిజం దెబ్బతినడం శ్రీలంకను దివాలా అంచున నిలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకకు స్నేహ హస్తాన్ని అందించింది భారత్...

Sri Lanka : శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం

Srilanka

Sri Lanka Economic Crisis : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం అందించింది భారత్. శ్రీలంక వాసుల కష్టాలను పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏకంగా బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది ఇండియా. శ్రీలంకలో మూడు రోజుల పాటు పర్యటించారు కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్. శ్రీలంకను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శ్రీలంకలో ఇప్పటికే తీవ్ర ఆహార కొరత నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి.

Read More : Russia Armed Forces Killed : యుద్ధంలో 17,200 మంది రష్యన్ సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

ధరల పెరుగుదలతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యవసరాల దిగుమతుల కోసం బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది భారత్‌. అభివృద్ధి పేరుతో శ్రీలంకను పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసింది చైనా. ముందు నుంచి భారత్‌ హెచ్చరించినా పట్టించుకోలేదు. కీలక కాంట్రాక్టులు చైనాకే కట్టబెడుతూ భారత్‌ మాటలను పెడచెవిన పెట్టింది.

Read More : Srilanka – India: శ్రీలంక ఆర్ధిక మంత్రిని కలిసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

సేంద్రీయ సాగు కోసం వెంపర్లాడటం.. కోవిడ్ ప్రభావంతో టూరిజం దెబ్బతినడం శ్రీలంకను దివాలా అంచున నిలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకకు స్నేహ హస్తాన్ని అందించింది భారత్. శ్రీలంక కష్టాల్లో ఉన్నపుడల్లా ఇండియా సాయం అందిస్తూనే ఉంది. శ్రీలంకలో ఎరువుల కొరత ఏర్పడినప్పుడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాల్లో ఎరువులను పంపించింది. గత నెలలోనే పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు కోసం శ్రీలంకకు భారత్ 50 కోట్ల డాలర్ల సాయాన్ని అందించింది. ఇప్పుడు మరో వంద కోట్ల డాలర్ల రుణం అందించింది భారత్.