Cullinan Diamond: ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని వజ్రాలు మావే.. తిరిగిచ్చేయాలంటూ దక్షిణాఫ్రికా డిమాండ్

ఎలిజబెత్-2 కిరీటంలో పొదిగి ఉన్న వజ్రాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధరించిన కిరీటంలోని వజ్రాలు తమవేనని, వాటిని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.

Cullinan Diamond: ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని వజ్రాలు మావే.. తిరిగిచ్చేయాలంటూ దక్షిణాఫ్రికా డిమాండ్

Cullinan Diamond

Cullinan Diamond: ఏడు దశాబ్దాలకు పైగా బ్రిటన్ సామ్రాజ్య సింహాసనంపై తిరుగులేని రాణిగా వెలుగొందిన ఎలిజబెత్-2 శకం ముగిసింది. అబ్బురపరచే బ్రిటిష్ రాచ మర్యాదలు, సంప్రదాయాలు, అధికార లాంఛనాలు, గౌరవ వందనాలు, సైనిక కవాతుల నడుమ బ్రిటన్ రాణి అంత్యక్రియలు సోమవారం రాత్రి లండన్ విండ్సర్ క్యాజిల్ లోని సెయింట్ జార్జి చాపెల్ లో పూర్తయ్యాయి. ఎలిజబెత్-2 కిరీటంలో పొదిగి ఉన్న వజ్రాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధరించిన కిరీటంలోని వజ్రాలు తమవేనని, వాటిని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.

Queen Elizabeth-2: క్వీన్ ఎలిజబెత్ -2ను ఖననంచేసే స్థలం ఎక్కడ ఉంది? దాని ప్రాముఖ్యత ఏమిటి?.. ఇక్కడ ఎన్నో శుభకార్యాలు కూడా..

రాణిదండలో ఉన్న గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని పిలవబడే కల్లినన్ డైమాండ్ తమదేనని, తిరిగి ఇచ్చేయాలని దక్షిణాఫ్రికా డిమాండ్ చేస్తుంది. కల్లినస్-1గా పేర్కొనే ఈ 500 క్యారెట్ల డైమండ్ ను దక్షిణాఫ్రికాలో 1905లో జరిపిన మైనింగ్ లో లభ్యమైనట్లు, సీఎన్ఎన్ పేర్కొంది. ఈ గ్రేట్ స్టార్ వజ్రాన్ని ఆఫిక్రాలోని వలస పాలకులు బ్రిటిష్ రాజకుటుంబానికి ఇవ్వగా ప్రస్తుతం ఆ వజ్రాన్ని రాణిదండపై అమర్చారు. తాజాగా బ్రిటన్ తమ నుంచి ఎత్తుకెళ్లిన బంగారం వజ్రాలన్నీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

కల్లినస్ వజ్రాన్ని తక్షణమే ఇచ్చేయాలని దక్షణాఫ్రికా నుంచి భారీగా డిమాండ్ వినిపిస్తోంది. డైమండ్ ఇచ్చేయాలంటూ ఆన్ లైన్ పిటీషన్ ద్వారా సంతకాలు సేకరించగా, ఇప్పటికే 6వేల మందివరకు సంతకాలు చేశారు. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ డైమండ్ ను టవర్ ఆఫ్ లండన్ లో ఉన్న జ్యువెల్ హౌస్ లో ప్రజల సందర్శనార్థం ఉంచినట్లు సమాచారం.