Drug Cartel : దారుణం.. ఉద్యోగం మానేస్తున్నారని 8మంది అతి కిరాతకంగా హత్య, అసలేం జరిగిందంటే..

Drug Cartel : మానవ శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు అదే ప్రాంతంలో బయటపడ్డాయి. అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది.

Drug Cartel : దారుణం.. ఉద్యోగం మానేస్తున్నారని 8మంది అతి కిరాతకంగా హత్య, అసలేం జరిగిందంటే..

Drug Cartel (Photo : Google)

Drug Cartel – Workers Killed : అవును.. ఉద్యోగం మానేస్తున్నారని వారిని దారుణంగా హత్య చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 8మంది ఉద్యోగులు అతి కిరాతకంగా చంపబడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ ఘటన మెక్సికోలో వెలుగుచూసింది. అదో కాల్ సెంటర్. అందులో పని చేసే 8మంది యువతీ యువకులు జాబ్ మానివేయడానికి సిద్ధమయ్యారు. వాళ్లు అలా డిసైడ్ అయ్యారో లేదో.. ఇలా మర్డర్ అయిపోయారు. అదో డ్రగ్ కార్టెల్. మెక్సికోలో ఉంటుంది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతోంది డ్రగ్ కార్టెల్. అందులో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది.

మెక్సికో గవాడజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఓ కాల్ సెంటర్ నడుస్తోంది. జలిసోకు హింసాత్మక ముఠాగా పేరుంది. కాల్ సెంటర్ లో పని చేస్తున్న 8 మంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు. మే 20 నుండి 22 మధ్య వీరు అదృశ్యమయ్యారు. కనిపించకుండా పోయిన వారిలో ఆరుగురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. అందరి వయసు 30ఏళ్ల లోపే ఉంటుంది. వీరి మిస్సింగ్ కు సంబంధించి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

అదే సమయంలో మానవ శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు అదే ప్రాంతంలో బయటపడ్డాయి. అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా.. అవన్నీ కూడా తప్పిపోయిన 8మందివి అని తేలింది.

జలిసో.. కాల్ సెంటర్ వంటి సాధారణ కార్యకలాపాలతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్, దోపిడీ, కిడ్నాప్ లకు కూడా పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. ఆ కాల్ సెంటర్ లో పని చేసే ఉద్యోగుల దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.

Also Read..Mumbai College girl : ముంబయి కాలేజీ హాస్టల్లో దారుణం

ఆఫీసుకి వెళ్లిన ఆ 8మంది యువతీ యువకులు.. డ్యూటీ అయిపోయాక కూడా ఇంటికి వెళ్లలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వారి గురించి అన్ని చోట్ల విచారించారు. కానీ, ఎలాంటి సమాచారం లభించలేదు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఉద్యోగులు దారుణ హత్యకు గురైన విషయం బయటపడింది. కాగా, తమ పిల్లలు సాధారణ కాల్ సెంటర్ లోనే పని చేస్తున్నట్లు వారి తల్లిదండ్రులు భావించారు. అయితే, అత్యంత హింసాత్మక గ్యాంగ్ ఆధ్వర్యంలో ఆ కాల్ సెంటర్ నడుస్తోందని, భారీ మోసాలకు పాల్పడుతున్నారనే విషయం తమకు తెలియదన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా అమెరికన్లు, కెనడియన్లను టార్గెట్ చేస్తున్నారు. నకిలీ ఆఫర్ల ద్వారా వారిని మోసం చేసి వారి డబ్బు కాజేస్తున్నారు.

జలిసో కార్టెల్, దాని మొదటి అక్షరాలతో CJNG అని పిలుస్తారు. దేశద్రోహులు, ఇన్‌ఫార్మర్లు లేదా టర్న్‌కోట్ల పట్ల క్రూరమైన చికిత్సకు ప్రసిద్ధి చెందింది. తెలిసో తెలియకో కార్టెల్‌లో పనిచేసిన వారికి ఈ ముఠా నుండి బయటపడాలంటే మరణం లేదా జైలుకి వెళ్లడం ఒక్కటే మార్గం అని పోలీసులు వెల్లడించారు.