Pele: నేను బాగానే ఉన్నా.. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చిన పీలే

దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ పీలే అనారోగ్యంపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగింది. దీనిపై పీలే స్వయంగా ఒక ప్రకటన చేశారు.

Pele: నేను బాగానే ఉన్నా.. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చిన పీలే

Pele: లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్, బ్రెజిల్ ఆటగాడు పీలే తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చాడు. తాను బాగానే ఉన్నానని, తిరిగి కోలుకుంటానని ప్రకటించాడు. 82 ఏళ్ల వయసున్న పీలే ఇటీవల క్యాన్సర్ కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం సావో పౌలో పట్టణంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Droupadi Murmu: నేడు ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రెండు రోజులపాటు పర్యటన

ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని ఇంతకుముందు వైద్యులు ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన ఆరోగ్యంపై ఇలాంటి ప్రచారం మొదలైన కొద్ది గంటల్లోనే పీలే స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశాడు. తాను బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళనా చెందక్కర్లేదని, తాను బాగానే ఉన్నానని ప్రకటించాడు. తాను సానుకూల దృక్పథంతో ఉన్నట్లు, చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పాడు. తనకు దేవుడి మీద విశ్వాసం ఉందని, తనపై అందరూ చూపిస్తున్న ప్రేమ మరింత శక్తినిస్తోందని తెలిపాడు.

Perennial Rice: సరికొత్త వరి పంట.. ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా, పీలేకు గతేడాది క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల క్యాన్సర్ సంబంధిత సమస్యతోనే ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.