Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?

సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?

Hijab women in Iran (file photo)

Hijab Row Iran: ఇరాన్ దేశంలో ఒకవైపు నిర్భంధ హిజాబ్ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుంటే.. ప్రభుత్వం మాత్రం హిజాబ్ ధరించాల్సిందేనని తేల్చి చెప్తోంది. దీనిపై ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఎంతలా అంటే.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించారా లేదా అని తెలుసుకునేందుకు రోడ్ల మీద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా మహిళలు హిజాబ్ లేకుండా కనిపిస్తే జరిమానా విధించనున్నట్లు ఇరాన్ అధికార యంత్రాంగం శనివారం ప్రకటించింది.

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం‌లో భాగంగానే ఈ డ్రామా-పేపర్ లీక్‌పై రేవంత్ రెడ్డి

ఈ విషయమై ప్రభుత్వం హెచ్చరకలు జారీ చేస్తోంది. కూడళ్లలో వివిధ మాధ్యమాల ద్వారా దీనికి విస్తృత ప్రచారం కల్పిస్తోంది. హిజాబ్ ధరించని వారికి సైతం జరిమానాకు సంబంధించిన సందేశాలు పంపనున్నారట. నిర్భంధ హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనను లక్ష్యంగా చేసుకునే ఈ కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చర్యలు ఇస్లాం ఆధ్యాత్మిక ప్రతిష్టను దెబ్బ తీస్తుందని ఇరాన్ మీడియా అభిప్రాయపడింది.

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు.. జమ్మూ కశ్మీర్‭లో ప్రమాదం

గత సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలలైనా ఈ ఆందోళన ఆగడం లేదు. అయితే నిరసనకారులపై ఇరాన్ భద్రతా బలగాలు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. అనేక మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఢిల్లీ, కేరళలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

ఇరాన్ మహిళలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా మాల్స్, రెస్టారెంట్లు, దుకాణాలు, వీధుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పోలీసులను ప్రతిఘటిస్తున్న మహిళల వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 1979 విప్లవం అనంతరం ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం.. మహిళలు తమ జుట్టును కప్పుకోవాలి, వారి బొమ్మలను దాచిపెట్టడానికి పొడవాటి, వదులుగా ఉండే దుస్తులను ధరించాలని ఇరాన్ ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ఇలాంటి ఆదేశాలు గత దశాబ్దాలలో మహిళలపై దాడులకు కారణమయ్యాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి.