Japan Govt Offers : టోక్యో ప్రజలకు జపాన్ ప్రభుత్వం ఆఫర్..నగరాన్ని విడిచి వెళ్తే రూ. 6.35 లక్షలు ఇస్తామని ప్రకటన
టోక్యోలో అంతకంతకు పెరిగిపోతున్న జనాభాను నియంత్రించలేకపోతున్న జపాన్ ప్రభుత్వం ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది. రాజధాని నగరాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహక బహుమతిని భారీగా పెంచింది. గతంలో ఇచ్చిన ఆఫర్ కు పెద్దగా స్పందన రాకపోవటంతో ఆ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది.

Japan govt offers : మా ప్రాంతానికి రండీ..ఇక్కడ ఇల్లు కట్టుకోండి..స్థలం ఇస్తాం. ఇల్లు కట్టుకోవటానికి డబ్బులిస్తాం అనే ప్రభుత్వాలను చూశాం. జనాభా పెంచాలనే ఉద్ధేశంతో..ఇక్కడకొచ్చి ఇల్లు కట్టుకునేవారికి స్థలం ఉచితంగా ఇస్తామని ప్రకటించే ప్రభుత్వాలను చూశాం. కానీ జపాన్ ప్రభుత్వం మాత్రం దీనికి ఫుల్ డిఫరెంట్. జపాన్ రాజధాని టోక్యో నగరం నుంచి వెళ్లిపోతే భారీగా నగదు బహుమానం ఇస్తామని ప్రకటించి నగర వాసులకు. జనాభా పెంచటానికి కొన్ని ప్రాంతాల్లో ఆఫర్లు ఇస్తే జపాన్ రాజధాని నగరంలో భారీగా పెరిగిన జనాభా సమస్యగా మారింది. దీంతో జపాన్ ప్రభుత్వం రాజధాని నగరం టోక్యో నుంచి వెళ్లిపోతే 10 లక్షల యెన్‌లు అంటే భారత కరెన్సీలో 6.35 లక్షలు ఇస్తామని ప్రకటించింది.
టోక్యోలో అంతకంతకు పెరిగిపోతున్న జనాభాను నియంత్రించలేకపోతున్న జపాన్ ప్రభుత్వం ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది. రాజధాని నగరాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహక బహుమతిని భారీగా పెంచింది. గతంలో ఇచ్చిన ఆఫర్ కు పెద్దగా స్పందన రాకపోవటంతో ఆ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. గతంలో టోక్యోను వీడే కుటుంబంలోని ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్‌ల (జపాన్ కరెన్సీ) చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు దానిని రూ. 10 లక్షల యెన్‌ల (దాదాపు రూ. 6.35 లక్షలు) కు పెంచింది. పెంచిన ఈ బహుమతి 2023 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. మరి ఇప్పుడైనా ప్రభుత్వ ప్రకటనకు స్పందన వస్తుందేమో చూడాలి.
Land free : ఆ సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ : ప్రకటించిన ప్రభుత్వం..
కాగా జపాన్ రాజధాని టోక్యో నగరంలో 3.80 కోట్లకుపైగా జనాభా నివసిస్తున్నారు. టోక్యో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రికార్డును సంపాదించుకుంది. సాధారణంగా రాజధాని నగరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీంతో ప్రజలు భారీగా టోక్యో నగరంలో నివసిస్తున్నారు. టోక్యోకు జనాలు వలస వచ్చి సెటిల్ అయిపోతున్నారు. కరోనా తరువాత ఈ వలసలు మరింతగా పెరిగాయి. దీంతో జపాన్ లోని మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోయి సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి పలు నగరాలు. దీంతో ఆ నగరాల్లో జనం లేక వ్యాపారాలు తీవ్రగా నష్టపోతున్నాయి. ఆర్థికంగా కుదేలైపోతున్నాయి. ఇది ఆ ప్రాంతపు పాలనమీద కూడా ప్రభావం పడుతోంది. ప్రజల ఆర్థిక స్తోమతపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో టోక్యో నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను ప్రటించింది. వాటిని పెంచుతోంది.
పైగా జపాన్ లో జననాలు రేటు కూడా తీవ్రంగా పడిపోతోంది. ఫలితంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వంపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వం జననాల రేటు తక్కువగా ఉన్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేందుకు 2019 నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.
Read more : ఇటలీ గ్రామం స్పెషల్ ఆఫర్: 86రూపాయలకే ఇల్లు.. కండిషన్స్ అప్లై
ఒకరికంటే ఎక్కువమంది పిల్లలున్న కుటుంబానికి గతంలో 30 లక్షల యెన్‌లవరకు ఆర్థిక సాయంతోపాటు ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్‌ల చొప్పున ఇచ్చింది ప్రభుత్వం. వలస వెళ్లిన ప్రాంతంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి కూడా ఆర్థిక సాయం అందించేది. అయినప్పటికీ మార్పు పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వం ఆశించినంతగా ఈ వలసలు లేకపోవటంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచుతోంది. 2021లో 2,400 కుటుంబాలు మాత్రమే టోక్యోను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది.మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఆశించేది జరుగుతుందేమో చూడాలి. కాగా..35 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రేటర్ నగరంగా టోక్యో ఉంది.