Kim ‘Real-War’ Orders : ‘నిజమైన యుద్ధానికి’ సిద్దం కావాలని కిమ్ ఆదేశం .. కూతురితో సైనిక విన్యాసాలను వీక్షించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ‘నిజమైన యుద్ధానికి’సిద్ధం కావాలంటూ సైన్యానికి ఆదేశించారు. తన ముద్దుల కుమార్తె జు ఏ తో కలిసి కిమ్ ఉత్తర కొరియా హస్వాంగ్ ఆర్టిలరీ దళం చేపట్టిన విన్యాసాలకు హాజరయ్యారు. కిమ్ తీరు చూస్తుంటే ఇక యుద్ధసన్నాహాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలు క్షిపణి ప్రయోగాలతో ఇటు అమెరికా అటు సరిహద్దు దేశమైన దక్షిణకొరియాలకు వార్నింగ్ లకు ఇచ్చిన కిమ్ ఇక నిజమైన యుద్ధానికి సిద్దంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

Kim ‘Real-War’ Orders : ‘నిజమైన యుద్ధానికి’ సిద్దం కావాలని కిమ్ ఆదేశం .. కూతురితో సైనిక విన్యాసాలను వీక్షించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

Kim Jong Un Directs Military To Prepare For ‘Real War’

Kim ‘Real-War’ Orders :  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ‘నిజమైన యుద్ధానికి’సిద్ధం కావాలంటూ సైన్యానికి ఆదేశించారు. తన ముద్దుల కుమార్తె జు ఏ తో కలిసి కిమ్ ఉత్తర కొరియా హస్వాంగ్ ఆర్టిలరీ దళం చేపట్టిన విన్యాసాలకు హాజరయ్యారు. కిమ్ తీరు చూస్తుంటే ఇక యుద్ధసన్నాహాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలు క్షిపణి ప్రయోగాలతో ఇటు అమెరికా అటు సరిహద్దు దేశమైన దక్షిణకొరియాలకు వార్నింగ్ లకు ఇచ్చిన కిమ్ ఇక నిజమైన యుద్ధానికి సిద్దంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. సైనిక అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో కిమ్ నల్ల జాకెట్లు ధరించారు. ఆయనతో పాటే ఉన్న కుమార్తె కూడా నల్ల జాకెట్ ధరించి ఉన్నారు. తండ్రీ కుమార్తెలు ఇద్దరు కలిసి అధికారులు చేసిన సైనిక విన్యాసాలను వీక్షించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kim’s Daughter: కూతురికి 9 ఏళ్లు మాత్రమే.. అప్పుడే ఉ.కొరియా అధ్యక్షురాలిగా ఆమెను కిమ్ ఎందుకు చూపుతున్నారు?

కిమ్ తీరు చూస్తుంటే యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా వరుస ఆయుధ పరీక్షలతో పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు పంపుతున్న ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తాజాగా యుద్ధ సన్నాహాల పట్ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిజమైన యుద్ధం కోసం సైన్యం విన్యాసాలు తీవ్రతరం చేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేయటం చూస్తే ఇక విధ్వంసం తప్పదా? అనిపిస్తోంది. ఓ పక్క రష్యా-యుక్రెయిన్ వార్ కొనసాగుతునే ఉంది. మరోపక్క చైనా భారత్ పై కుట్రలు..మరోపక్కక తైవాన్ పై విరుచుకుపడటానికి చూస్తోంది. ఇక ఉత్తరకొరియా కూడా యుద్ధానికి సిద్ధమంటుంటే ఇక యుద్ధాల కాలం మరోసారి వచ్చిందా?అనే ఆందోళన కలుగుతోంది.

North Korea Kim : కిమ్ కూతురికి నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలు..?

ఉత్తర కొరియా హస్వాంగ్ ఆర్టిలరీ దళం చేపట్టిన విన్యాసాలకు కిమ్ తన రెండో కుమార్తెతో కలిసి హాజరయ్యారు కావటంతో చూస్తే మరోసారి కూతుర్ని అధ్యక్షురాలిని చేస్తారనే వార్తలు బలపడుతున్నాయి. ఇటువంటి కీలక ఆదేశాల సమయంలోకూడా కుమార్తెను కూడానే కిమ్ తిప్పుకుంటున్నారంటే ఇక ఉత్తరకొరియా కొత్త అధ్యక్షురాలిగా కూతురు ఖరారు అనేలా ఉంది పరిస్థితి. సైనిక విన్యాసాల్లో భాగంగా కిమ్ అధికారుల వద్ద యుద్ధం ప్రస్తావన తీసుకువచ్చారు. యుద్ధాన్ని నిరోధించడానికి..యుద్ధంలో పాల్గొనడానికి సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటి విన్యాసాలతో సన్నాహాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.ఉత్తరకొరియా నేతృత్వంలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం (మార్చి 10,2023)ఈ ఫోటోలను విడుదల చేసింది.

Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!

హస్వాంగ్ ఆర్టిలరీ ఫైరింగ్ యూనిట్ ఒకేసారి 6 క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. అమెరికా-దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా ఈ సోమవారం (మార్చి,2023) నుంచి భారీ సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. దీనికి ప్రతిగా ఉత్తర కొరియా సైనిక విన్యాసాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్