Sri Lanka : శ్రీలంక కీలక నిర్ణయం.. భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు ఉచిత వీసాలు జారీ

శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగానిదే కావడం విశేషం.

Sri Lanka : శ్రీలంక కీలక నిర్ణయం.. భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు ఉచిత వీసాలు జారీ

Sri Lanka visa free entry

Sri Lanka Visa Free Entry : పర్యాటక రంగాన్ని శ్రీలంక ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్ దేశాలు పర్యాటకులకు ఉచిత వీసాలు జారీ చేసేందుకు శ్రీలంక కేబినెట్ ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు.

పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగానిదే కావడం విశేషం. కరోనాకు ముందు శ్రీలంక పర్యాటక ఆదాయం 360 కోట్ల డాలర్లు ఉండగా, ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది.

Israel Palestine Conflict: పేదరికం, ఆకలితో గాజా స్ట్రిప్ ప్రజల తిప్పలు.. విదేశాల్లో విలాసవంతమైన జీవితంలో హమాస్ ఉగ్రవాదులు

2019 నాటి కరోనా సంక్షోభానికి ఇక్కడి పర్యాటక రంగం కుదేలైంది. దానికి తోడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో దేశం మొత్తం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. దీంతో శ్రీలంకకు పర్యాటకుల రాక క్రమంగా తగ్గిపోయింది. ఏటా శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్ ను చెందినవారే కావడం గమనార్హం.

యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడి పర్యాటకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో శ్రీలంక ఆదాయానికి మరింతగా గండిపడింది. దీంతో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు నడుం బిగించిన శ్రీలంక ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే 2023 సంవత్సరానికి 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఫ్రీ వీసా పాలసీని తీసుకొచ్చింది.