Work from Home: ఆఫీసు కుర్చీని ఇంటికి తీసుకెళ్లడం ఉద్యోగం తొలగించేంత నేరం కాదు

ఇంటి నుంచి పనిచేసేందుకు ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్తే.. దాన్ని తప్పుగా బావించలేమని, ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించేంత అతి తీవ్ర నేరంగా పరిగణించలేమన్న జర్మన్ లేబర్ కోర్ట్.

Work from Home: ఆఫీసు కుర్చీని ఇంటికి తీసుకెళ్లడం ఉద్యోగం తొలగించేంత నేరం కాదు

Ofc Chair

Work from Home: సంస్థలో పనిచేసే ఉద్యోగి ఇంటి నుంచి పనిచేసేందుకు ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్తే.. దాన్ని తప్పుగా బావించలేమని, ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించేంత అతి తీవ్ర నేరంగా పరిగణించలేమని జర్మన్ లేబర్ కోర్ట్ స్పష్టం చేసింది. జర్మనీలోని “కొలోన్ ఆర్చ్ డియోసెస్” అనే చర్చిలో పనిచేసే ఉద్యోగి ఒకరు, లాక్ డౌన్ సమయంలో ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్లగా..అది నేరమంటూ ఆ ఉద్యోగిని తొలగించారు చర్చి నిర్వాహకులు. దీంతో సదరు ఉద్యోగి కోర్టుకెక్కారు. 2020 కరోనా తీవ్రదశలో ఉన్నపుడు జరిగిన ఈ ఘటనపై ఇటీవల జర్మన్ లేబర్ కోర్ట్ తీర్పు వెల్లడించింది.

Also read: Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలులోపు స్మార్ట్ ఫోన్స్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ ఉద్యోగులకు ఓ సరికొత్త అనుభవపాఠాన్ని నేర్పింది. కరోనా వ్యాప్తి తీవ్రదశలో ఉన్నపుడు వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించాయి. ఈక్రమంలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇంటి వద్ద కూడా మౌలిక సదుపాయాలు కల్పించగా, కొన్ని సంస్థలు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. జర్మనీలోని ప్రముఖ కాథలిక్ చర్చి “కొలోన్ ఆర్చ్ డియోసెస్”(Archdiocese of Cologne) కూడా తమ ఉద్యోగులను(ట్రస్ట్ ఉద్యోగులు) ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే ఇంటి నుండి పనిచేసే ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు సంస్థకు చెందిన కార్యాలయంలోని కుర్చీని ఇంటికి తీసుకువెళ్లారు. సదరు ఉద్యోగిని చర్చి నిర్వాహకులు ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీనిపై లేబర్ కోర్టుకు వెళ్లిన ఉద్యోగి..తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ జడ్జితో వాదించింది.

Also read: Pakistan Drones: చైనా నుంచి మరిన్ని డ్రోన్లు కొనుగోలు చేసిన పాకిస్తాన్

అయితే ఉద్యోగి తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా చెప్పకుండా కుర్చీ తీసుకెళ్లి శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని చర్చి తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. సదరు ఉద్యోగి తీసుకెళ్లిన కుర్చీ సంస్థకు ఎంతో విలువైన వస్తువుగా న్యాయవాది వాదించారు. ఇక ఇద్దరి వాదనలు విన్న కోర్ట్..ఉద్యోగి చర్యను సమర్ధించింది. సంస్థకు చెందిన వస్తువు విలువైనదైనా సరే.. ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే దాన్ని తీసుకెళ్లే హక్కు ఉద్యోగికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుత వ్య్వవహారంలో ఉద్యోగి.. సంస్థకు సమాచారం ఇవ్వకుండా కుర్చీని తీసుకెళ్లి నిబంధనలు అతిక్రమించారని అయినప్పటికీ, ఉద్యోగం నుంచి వారిని తొలగించడం భావ్యం కాదని కోర్టు పేర్కొంది. అయితే ఇప్పటికే సదరు ఉద్యోగిని “కొలోన్ ఆర్చ్ డియోసెస్” యాజమాన్యం తొలగించగా.. కోర్టు తీర్పు మేరకు తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా లేదా అనే విషయం మాత్రం తెలియారాలేదు.

Also read: Govt Teacher: పది కూడా పాస్ అవని పప్పూ.. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్