Taliban Ban Narcotics: గసగసాల సాగుపై తాలిబన్ రాజ్యం నిషేధం: పంట వేస్తే ఇక అంతే

ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇప్పటి నుండి దేశవ్యాప్తంగా గసగసాల సాగును పూర్తిగా నిషేధించారని ఆఫ్ఘన్‌లందరికీ తెలియజేయబడింది

Taliban Ban Narcotics: గసగసాల సాగుపై తాలిబన్ రాజ్యం నిషేధం: పంట వేస్తే ఇక అంతే

Poppy

Taliban Ban Narcotics: తాలిబన్ రాజ్యం అఫ్గానిస్తాన్ లో ప్రజాకర్షక పాలన అందించే విధంగా తాలిబన్ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రజలపై మతపరమైన ఆంక్షలు విధించిన తాలిబన్లు..ఇపుడు ప్రపంచ దేశాల మెప్పుకోసం ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా దేశంలో అసాంఘీక కార్యకలాపాలను సమూలంగా నిషేధిస్తూ తాలిబన్లు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా దేశంలో మత్తు పదార్ధాల మొక్కల పెంపకంపై తాలిబన్ నేతలు ప్రజలకు హెచ్చరికలు చేశారు. “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇప్పటి నుండి దేశవ్యాప్తంగా గసగసాల సాగును పూర్తిగా నిషేధించారని ఆఫ్ఘన్‌లందరికీ తెలియజేయబడింది” అంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు తాలిబన్ నేతలు.

Also read:Russian Soldiers Die : యుద్ధంలో 18వేల మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

ఈ ఆదేశాలు ధిక్కరించి ఎవరైనా గసగసాలను సాగు చేస్తే ఆ పంటను నాశనం చేయడంతో పాటు షరియా ఇస్లామిక్ చట్టాల ప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో నల్లమందు ఉత్పత్తి అదుపులేకుండా సాగుతుందని, ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఒక్క 2017లోనే దాదాపు $1.4 బిలియన్ల విలువైన నల్లమందు ఎగుమతులు అఫ్గానిస్తాన్ నుంచి జరిగినట్టు తెలిపింది. కాగా 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు..దేశంలో మత్తు పదార్థాల కట్టడిని తమ ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం మత్తు పదార్దాలు సేవించడం.. వాటిని తాకడం కూడా నేరంగా పరిగణిస్తారు.

Also read:Severe Heatwave: వేడి నుంచి అతి వేడిగా మారనున్న వాతావరణం: వాతావరణశాఖ హెచ్చరిక

కాగా అఫ్గాన్ ను వశపరుచుకున్న అనంతరం తమను ఇస్లామిక్ ఎమిరేట్ గా గుర్తించాలంటూ అంతర్జాతీయ సమాఖ్యను కోరిన తాలిబన్లు..ఆమేరకు దేశంలో ఇటువంటి అసాంఘిక చర్యలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లమందు (opium) ఉత్పత్తిలో అఫ్గానిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. ఆహార పంటలు వేస్తే లాభాలు రావంటూ అక్కడి రైతులు ఇలా గసగసాల సాగు చేస్తుంటారు.

Also read:Corona in China: చైనాలో మరోసారి కరోనా విలయతాండవం: వైరస్ కేంద్రంగా షాంఘై నగరం